పుష్ప సినిమా కోసం అనవసరంగా తీసిన సీన్స్.. ఎడిటింగ్ లో లేపేసిన వాటి ఖర్చు ఎంతంటే?
సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ ను తెరపైకి వచ్చిన పుష్ప సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి వారంలో ఈ సినిమా వసూళ్లు బాగానే అందుకున్నపప్పటికీ కూడా బ్రేక్ ఈవెన్ అందుకోవడానికి ఆ కలెక్షన్స్ ఏమాత్రం సరిపోవు. ఇంకా భారీ స్థాయిలో షేర్ రాబట్టాల్సి ఉంది. ఇక సినిమాను రెండు భాగాలుగా తెరపైకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దర్శకుడు సుకుమార్ ఎప్పటిలానే అనవసరమైన సీన్స్ ను ఎక్కువగా తీసి చాలా డబ్బు వృధా చేసినట్లు తెలుస్తోంది. ఇక వాటి ఖర్చు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

ఎక్కువ అయినా పర్వాలేదు అని..
అగ్ర దర్శకులు చాలా వరకు కూడా మొదట స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే సినిమా నిడివి ఎంతో చాలా తెలివిగా అంచనా వేసుకుంటారు. అయితే మరికొందరు మాత్రం ఎక్కువ అయినా పర్వాలేదు అని సినిమా ఎడిటింగ్ లో అవసరమైతే వాడుకోవచ్చు లేదా తీసేయొచ్చు అని కూడా అనుకుంటారు. ఇక కాలిక్యులేషన్స్ అయితే నిర్మాతలకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.

సుకుమార్ పై కంప్లైంట్
చిత్ర పరిశ్రమలో దర్శకుడు సుకుమార్ కూడా ఆ లెక్కల్లో అప్పుడప్పుడు చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఆయన మొదటి నుంచి కూడా చేసిన సినిమాలన్నీ నిడివి చాలా ఎక్కువగా వస్తుంటుంది. ఎడిటింగ్ చేయడానికి చివరలో చాలా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన తీసిన ఫుటేజ్ చాలా ఎక్కువగా ఉంటుందట. నిర్మాతల నుంచి ప్రతిసారి ఈ కంప్లైంట్ ఉన్నప్పటికీ కూడా ఆయన మీద ఉన్న గౌరవం తో బయటకు చెప్పేవారు కాదు.

వాటి విలువ 30కోట్లు
ఇక పుష్ప సినిమాలో కూడా రెండు భాగాలకు సరిపోయేంత ఫుటేజ్ చిత్రీకరించారు. అసలైతే మొదట ఒక భాగంలోనే సినిమాను పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ సినిమా నిడివి చాలా ఎక్కువగా ఉంది అనే రెండు భాగాలుగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే ఫస్ట్ పార్ట్ లో అనవసరంగా తీసిన సన్నివేశాలలో చాలా వరకు ఎడిటింగ్ కట్ చేయాల్సి వచ్చిందట. వాటి విలువ దాదాపు 30 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

రెండవ భాగం..
పుష్ప మొదటి భాగంలో డిలీట్ చేసిన సన్నివేశాలను కనీసం రెండో భాగంలో కూడా ఉపయోగించడానికి వీలు పడటం లేదట. దర్శకుడు సుకుమార్ ఇప్పటికే రెండో భాగం షూటింగ్ దాదాపు 80 శాతానికి పైగా పూర్తి చేశాడు. ఇంకా మరో 20 శాతం పూర్తి చేయాల్సి ఉంది. త్వరలోనే ఆ షూటింగ్ ను కూడా పూర్తి చేయాలని అనుకుంటున్నారు.

సమంత ఐటెమ్ సాంగ్ లో కూడా..
అయితే ఎక్కువగా వేస్ట్ అయినా ఫుటేజ్ లో సమంత కు సంబంధించిన ఐటెం సాంగ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో వివిధ రకాల షేడ్స్ లో పాటను చిత్రీకరించారట దాదాపు కోటిన్నర వరకు అక్కడ వృధా అయినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా పుష్ప సినిమా మొదటి భాగంలో అయితే 30 కోట్ల వరకు వృధా అవ్వడంతో సినిమా బ్రేక్ ఈవెన్ పై కొంత ప్రభావం పడింది అనే చెప్పాలి. లేకపోయి ఉంటే ఈ పాటికే సినిమా ఈజీగా ఆ టార్గెట్ ను ఫినిష్ చేసేదని అర్థం అవుతోంది.


Click it and Unblock the Notifications











