Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Allu Arjun Upcoming Moives ప్రభాస్‌ను మించిపోయేలా లైనప్.. క్యూలో టాప్ దర్శకులు.. వందల కోట్ల ఆదాయం!
కరోనా లాక్ డౌన్ వలన సినిమా ఇండస్ట్రీలపై తీవ్ర స్థాయిలో ప్రభావం పడిందనేది అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఎంత ప్రభావం చూపించిందో.. భవిష్యత్తులో అంతకంటే ఎక్కువ స్థాయిలో మార్కెట్ వాల్యూ పెరిగేలా స్టార్ హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ కూడా వరుసగా ఐదుగురు దర్శకులను క్యూలో పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.
Recommended Video
గ్యాప్ లేకుండా
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా న్యూ బ్రాండ్ ఇమేజ్ అందుకుంటున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పవర్ఫుల్ గా సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తరువాత బన్నీ ఐదేళ్లకు సరిపడే సినిమాలను సెట్ చేసుకున్నాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వెంటవెంటనే సినిమాలను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు.
ప్రభాస్ కంటే ఎక్కువగా
ఒక రకంగా అల్లు అర్జున్ లైనప్ చూస్తుంటే ప్రభాస్ కంటే ఎక్కువ సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలను లైన్ లో పెట్టగా మరికొన్ని ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది. ఇక బన్నీ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఒకసారి ఆరు సినిమాలను లైన్ లో పెట్టాడు. దాదాపు ఆ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ దొరికినట్లే అనే టాక్ అయితే వస్తోంది.
ఐదుగురు దర్శకులు
పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా, మొదటి భాగం రిలీజ్ అనంతరం బన్నీ ఐకాన్ సినిమాను సెట్స్ పైకి తేనున్నాడు. ఇక ఆ తరువాత పుష్ప 2 వస్తుందట. ఇక 23వ సినిమా ఏఆర్.మురగదాస్ దర్శకత్వంలో ఉంటుందట. అనంతరం 24వ సినిమాను బోయపాటి దర్శకత్వంలో పూర్తి చేసి 25వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో ఫినిష్ చేస్తాడట. ఈ ఐదుగురు దర్శకులకు కూడా ముందే అడ్వాన్స్ అందినట్లు సమాచారం.
170కోట్ల ఆదాయం
ఒకేసారి ఆరు సినిమాలు అంటే బన్నీ ఇన్నేళ్ల కెరీర్ మొత్తంలో సంపాదించిన డబ్బు కంటే ఎక్కువ ఆదాయాన్ని వచ్చే ఆరు సినిమాలతో అందుకోబోతున్నాడట. పుష్ప కోసం ఒక్కో పార్ట్ కు 35కోట్ల వరకు అందుకున్న బన్నీ ఈజీగా ఈ నాలుగేళ్ళలో 170కోట్ల వరకు ఆదాయాన్ని అందుకుంటాడాని చెప్పవచ్చు. సినిమాలు ఊహకందని రేంజ్ లో హిట్టయితే వచ్చే ఆదాయం మరింత పెరగవచ్చని కూడా తెలుస్తోంది.