RRR రికార్డును బీట్ చేసిన పుష్ప 2.. బాలీవుడ్‌ను వణికిస్తున్న అల్లు అర్జున్!
భారతీయ సినిమా పరిశ్రమలో మోస్ట్ అవైటింగ్ మూవీ పుష్ప 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప: ది రైజింగ్ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారతీయ సినిమా పరిశ్రమలో కలెక్షన్లతో కలకలం రేపింది. దాంతో ఈ సినిమా కోసం ప్రేక్షకుల్లో ఎదురు చూపులు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్‌కు క్రియేట్ చేసిన సంచలన విషయాల్లోకి వెళితే..
పాన్ ఇండియా సినిమాగా రూపొందిన పుష్ప: ది రూల్ బిజినెస్ పరంగా రికార్డులు క్రియేట్ చేస్తున్నది. ఈ సినిమా ఆడియో, డిజిటల్ రైట్స్ ఊహకు అందని విధంగా అమ్ముడుపోతున్నాయి. థియేట్రికల్ రిలీజ్‌కు సంబంధించిన హక్కులు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తాజాగా నైజాం హక్కుల అమ్మకం వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

పుష్ప 2 సినిమా థియేట్రికల్ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. నైజాంకు చెందిన డిస్టిబ్యూటర్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకొన్నాడు. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మూవీ హక్కులు సుమారుగా 100 కోట్ల మేర అమ్ముడుపోయాయి అని ట్రేడ్ నిపుణులు తెలిపారు.
అయితే పుష్ప నైజాం థియేట్రికల్ బిజినెస్ విషయంలో RRR సినిమా రికార్డును తుడిపేసింది. రాజమౌళి సినిమా బిజినెస్ 100 కోట్ల కంటే తక్కువగా జరిగింది. ప్రస్తుతం నైజాంలో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది అని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, పుష్ప 2 సినిమా రిలీజ్‌కు ముందు బడా నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి వెనుకాడుతున్నారు. బాలీవుడ్‌లో ఈ సినిమాకు పోటీగా చిత్రాలను రిలీజ్ చేయడానికి ముందుకు రావడం లేదు. బాలీవుడ్‌లో ఇప్పటికే రిలీజ్ డేట్స్ ప్రకటించుకొన్న సినిమాలు తమ మూవీ రిలీజ్‌ను వాయిదా వేసుకొంటున్నాయి అని తెలిపారు.
ఇక బాలీవుడ్‌లో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సింగమ్ అగైన్ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. పుష్ప 2 తర్వాత మరో డేట్‌ను చూసి విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. అలాగే ఈ సినిమాతో పాటు మరో భారీ ప్రాజెక్టులను కూడా వాయిదా వేసుకొంటున్నారు అని తెలిసింది.


Click it and Unblock the Notifications











