ఇండియాను ఊపేస్తోన్న పుష్ప 2 .. అటు 959, ఇటు 860 ఔట్ .. అల్లు అర్జున్ రేర్ ఫీట్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 రికార్డులను తిరగరాస్తోంది. అప్పుడెప్పుడో మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప పార్ట్ 1కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా .. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి గతంలో ఏ భారతీయ చిత్రం అందకోని ఘనతను సాధించింది. లాంగ్ రన్‌లో రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఆర్ఆర్ఆర్, బాహుబలి రికార్డులను ఊడ్చిపారేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు.
పుష్ప పార్ట్‌కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫహద్ ఫాజిల్, అనసూయ, రావు రమేశ్, సునీల్, జగపతి బాబులు కీలకపాత్ర పోషించారు. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పుష్ప 2ను రిలీజ్ చేసింది. ట్రేడ్ పండితుల అంచనాలను నిజం చేస్తూ ఈ సినిమా నాలుగు రోజుల్లో ఏకంగా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ఇప్పటికే చాలా ఏరియాలలో బాహుబలి రికార్డులను అధిగమించిన పుష్ప 2 .. లాంగ్ రన్‌లో ఆర్ఆర్ఆర్ రికార్డులను బద్ధలు కొట్టాలని దూసుకెళ్తోంది. వారం రోజుల్లోగా రూ. 1000 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టాలని పుష్ప రాజ్ దూకుడు పెంచుతున్నాడు. సినిమాకి హిట్ టాక్ వచ్చినప్పటికీ మెజారిటీ ప్రేక్షకులు ఇంకా సినిమా చూడలేదని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. దీనికి కారణం భారీ టికెట్ ధరలు. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు సగటు ప్రేక్షకుడిని భయపెడుతుండటంతో చిత్ర యూనిట్ స్పందించింది.
ఏపీ, తెలంగాణలలో టికెట్ ధరలను తగ్గించినట్లుగా బుక్ మై షో వెబ్‌సైట్‌లో కనిపిస్తోంది. దీంతో ఇప్పటి వరకు టికెట్ ధరలు చూసి భయపడ్డ ప్రేక్షకులు ఇకపై థియేటర్‌కు వచ్చి పుష్ప 2ను వీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ వీకెండ్‌లో ఫ్యాన్స్ హంగామా ముగియడంతో ఈ వారం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్‌కు వస్తారని అంటున్నారు. దీంతో కలెక్షన్స్ మరింత ఊపందుకుంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

విడుదలైన నాటి నుంచి పుష్ప 2 పలు రికార్డులను బద్ధలు కొడుతోంది. బన్నీకి ఫ్యాన్ బేస్ ఉన్న తెలుగు రాష్ట్రాలను మంచి హిందీ బెల్ట్‌లో సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. ఒక్క హిందీలోనే పుష్ప2 ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటే పుష్ప మేనియాను అర్ధం చేసుకోవచ్చు. తాజాగా.. అల్లు అర్జున్ మరో రేర్ ఫీట్ సాధించాడు. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత లిబర్ట థియేటర్‌లో వర్కిండ్ గే అయిన సోమవారం నాలుగు ఆటలు హౌస్‌ఫుల్స్ పడ్డాయి.
మొత్తం 959 సీట్ల సామర్ధ్యం ఉన్న లిబర్టీ థియేటర్‌లో ఉదయం 11 గంటల ఆటకు హాల్ నిండగా.. తర్వాతి మూడు షోలకు అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే హౌస్‌ఫుల్ అయ్యింది. ఢిల్లీకి ఆనుకుని ఉండే ఆగ్రాలోనూ దాదాపు 860 సీట్ల సామర్థ్యం ఉన్న శ్రీ సినిమాలోనూ ఇదే పరిస్ధితి నెలకొంది. పరిస్థితి చూస్తుంటే ఈ వారం కూడా పుష్ప సునామీ సృష్టించే అవకాశాలు గట్టిగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











