18 మిలియన్ల సంచలనం .. అల్లు అర్జున్ ఆల్‌టైం రికార్డు .. బాహుబలి , కేజీఎఫ్‌లు గల్లంతు
క్రియేటివ్ జీనియస్ సుకుమార్- ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 సినిమా జైత్రయాత్ర ఆగడం లేదు. విడుదలైన 20 రోజుల్లో అడ్డొచ్చిన ప్రతి సినిమాను, రికార్డును బద్ధలు కొడుతూ ముందుకు సాగుతున్నాడు అల్లు అర్జున్. 20 రోజుల గ్యాప్‌లో దాదాపు 1600 కోట్ల వసూళ్లు రాబట్టిన పుష్ప 2 లాంగ్ రన్‌లో రూ.2000 కోట్ల టార్గెట్‌గా దూసుకెళ్తున్నాడు. ఆ ఫీట్ కోసం అల్లు అర్జున్ అభిమానులు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
పుష్ప 2 రిలీజ్ కాకముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. భారతీయ చిత్ర పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సినిమా బిజినెస్ చేసింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలిపి ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. ఇక ఏకంగా 11000 థియేటర్లలో విడుదలై గతంలో ఎన్నడూ ఏ సినిమాకు, ఏ హీరోకు సాధ్యం కాని విధంగా అరుదైన ఘనత సాధించింది.

విడుదలైన తొలి వారంలోనే 1000 కోట్లు రాబట్టిన పుష్ప 2.. ఆ తర్వాతి వారానికే రూ. 1400 కోట్ల మార్క్ అందుకుని కల్కి 2898 ఏడీ, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్‌లను దాటేసింది. ప్రస్తుతం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల్లో పుష్ప 2 మూడో స్థానంలో నిలిచింది. దీని కంటే ముందు దంగల్, బాహుబలి 2 సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్ జోరు చూస్తుంటే ఆ సినిమాల రికార్డులు కూడా మిగిలేలా కనిపించడం లేదు. ఈ వారంలోనే బాహుబలి 2 కలెక్షన్లను పుష్ప 2 అధిగమించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అల్లు అర్జున్‌కు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న తెలుగు రాష్ట్రాలను మించి హిందీలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. పుష్ప 2 పాటలు, మాటలు, ఫైట్స్‌కు నార్త్ ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. తెలుగులో కలెక్షన్స్ పడిపోయినా హిందీలో మాత్రం రోజుకు రూ. 10 కోట్లకు తక్కువ కాకుండా వసూళ్లు వస్తున్నాయంటే పుష్ప 2 హవాను అర్ధం చేసుకోవచ్చు. ఇక ప్రేక్షకుల కోసం పుష్ప చిత్ర మేకర్స్ అదనంగా కొన్ని సన్నివేశాలు యాడ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పుష్ప 2 సినిమా 3 గంటల 20 నిమిషాలు ఉండగా.. కొత్తగా మరో 20 నిమిషాలు జత చేస్తారని ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది.

వసూళ్లే కాదు.. టికెట్స్ బుకింగ్స్ విషయంలోనూ పుష్ప 2 సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో రీసెంట్‌గా పుష్ప 2 ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించింది. ఇప్పటి వరకు అత్యధికంగా టికెట్స్ బుక్ అయిన సినిమాగా యష్ - ప్రశాంత్ నీల్‌ల యాక్షన్ ప్యాక్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 నిలిచింది. ఈ సినిమాకు దాదాపు 17.01 మిలియన్స్ టికెట్స్ ఉండగా.. తర్వాతి స్థానంలో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్‌లు నిలిచాయి. అయితే ఇప్పుడు ఆ సినిమాను అధిగమించి నెంబర్ 1 ప్లేస్‌లో నిలిచింది పుష్ప2.
కేజీఎఫ్ 2 తన టోటల్ రన్ టైంలో సాధించిన రికార్డును పుష్ప 2 కేవలం 17 రోజుల్లోనే 17.27 మిలియన్స్‌తో అధిగమించింది. మూడో వారం ముగిసేసరికి మొత్తం 18 మిలియన్ల బుకింగ్స్‌తో పుష్ప 2 టాప్ ప్లేస్‌లో నిలుస్తాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











