Pushpa 2 Business అల్లు అర్జున్ కెరీర్‌లోనే రికార్డు బిజినెస్.. ఓవర్సీస్‌లో పుష్ప 2 లాభాల్లోకి రావాలంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్నది. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ సినిమా బిజినెస్ రికార్డులు బ్రేక్ చేస్తున్నది. పుష్ప మూవీ కంటే రెండితలు బిజినెస్‌ను రాబడుతున్నది. అయితే ఈ సినిమాకు జరుగుతున్న బిజినెస్ ట్రేడ్ వర్గాలకు కళ్లు చెదిరేలా చేస్తన్నది. పుష్ప 2 సినిమా ఓవర్సీస్ బిజినెస్ వివరాల్లోకి వెళితే..

పుష్ప ది రైజ్ అలియాస్ పుష్ప చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల మధ్యకు వచ్చింది. ఉత్తరాదిలో ప్రమోషన్స్ చేయకున్నా.. రికార్డు వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమాపై హైప్ విపరీతంగా పెరిగింది. దాంతో పుష్ప 2 బిజినెస్‌కు, థియేట్రికల్, డిజిటల్ రైట్స్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

Allu Arjun s Pushpa 2 sets record in Overseas Business Here is the details

తాజాగా పుష్ప 2 ఫస్ట్ సింగిల్ మే 1వ తేదీన రిలీజైంది. ఈ పాటకు సోషల్ మీడియాలోను, ఐకాన్ స్టార్ అభిమానుల నుంచి విశేషమైన స్పందన లభిస్తున్నది. ఈ పాట ట్రెండింగ్‌లోకి వెళ్లడమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచింది. ఐకాన్ స్టార్ బాక్సాఫీస్ స్టామినాను పెంచేలా ఉంది.

ఇదిలా ఉండగా, కొది కొద్దికాలంగా పుష్ప 2 సినిమా ఓవర్సీస్ బిజినెస్‌పై భారీ చర్చలు జరిగాయి. రకరకాల డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఈ సినిమా అమెరికా హక్కుల కోసం పోటీ పడ్డాయి. అయితే నిర్మాతలు భారీగా కోట్ చేయడంతో ఆ సంస్థలు వెనుకాడినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఫస్ట్ సింగిల్ తర్వాత ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ డీల్ ఓకే అయినట్టు తెలుస్తున్నది.

Allu Arjun s Pushpa 2 sets record in Overseas Business Here is the details

తాజా సోషల్ మీడియాలో సంచరిస్తున్న వార్త ప్రకారం.. పుష్ప ది రూల్ సినిమా థియేట్రికల్ హక్కులను ప్రత్యాంగిరా సినిమాస్ సొంతం చేసుకొన్నట్టు తెలిసింది. ఈ సినిమా కోసం 7.5 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 60 కోట్ల రూపాయలు చెల్లించి ఈ హక్కులను సొంతం చేసుకొన్నారనే వార్త ప్రముఖంగా వినిపిస్తున్నది.

అయితే ఈ సినిమా ఓవర్సీస్‌లో లాభాల్లోకి రావాలంటే.. కనీసం 8.5 మిలియన్ డాలర్లు రాబట్టాల్సి ఉంటుంది. ఒకసారి మూవీ టాక్ కనుక పాజిటివ్‌గా ఉంటే.. ఈ రేంజ్ కలెక్షన్లను సాధించడం సాధ్యమే అనే మాట వినిపిస్తున్నది. పుష్ప బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాకుండా ఏ రేంజ్ లాభాలను సాధిస్తుందో వేచి చూడాల్సిందే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X