తొలి రోజు ఏబీసీడీ ఎంత రాబట్టిందంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై రూపొందిన ఎంటర్‌టైనర్ మూవీ 'ఏబీసీడీ'. 'అమెరిక్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశి' అనేది ట్యాగ్ లైన్. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మాతలుగా వ్యవహరించారు. అల్లు శిరీష్, రుక్సాన్ హీరో హీరోయిన్లుగా నటించారు. మే 17 వ తేదీ శుక్రవారం రోజున ఈ సినిమా ప్రేక్షకు ముందుకొచ్చింది.
మొదటి షో తోనే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించ బడుతోంది. విడుదలైన అన్ని సెంటర్లలో తొలిరోజు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. తాజాగా చిత్రానికి సంబంధించి తొలి రోజు వసూళ్లను పేర్కొంటూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలిరోజు ఈ చిత్రం 2 కోట్ల 25 లక్షల గ్రాస్ రాబట్టింది. ఈ మేరకు చిత్రయూనిట్ సక్సెస్ సెలెబ్రేట్ చేసుకుంటోంది.

వైవిధ్య భరితమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అల్లు శిరీష్ కెరీర్‌ని మలుపు తిప్పుతుందని అంచనా వేస్తున్నారు సినీ విశ్లేషకులు. చిత్రంలో అల్లు శిరీష్, రుక్సాన్ థిల్లాన్ మధ్య షూట్ చేసిన ప్రేమ సన్నివేశాలు యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. భరత్, వెన్నెల కిషోర్ కామెడీ చిత్రానికి బాగా ప్లస్ అయింది. ఎంతో కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న అల్లు శిరీష్ కి ఈ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ మంచి విజయాన్ని తెచ్చిపెట్టిందనే చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











