Buddy Day 1 Collections: అల్లు శిరీష్‌కు షాక్.. తొలి రోజే షాకింగ్ కలెక్షన్లు.. అసలు హిట్ కావాలంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది ప్రముఖులు తమ కొడుకులను హీరోలుగా పరిచయం చేశారు. అందులో కొందరు మాత్రం సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిన్న కుమారుడు శిరీష్ ఒకడు. అప్పుడెప్పుడో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఎన్నో సినిమాలు చేసినా భారీ విజయాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 'బడ్డీ' (Buddy) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ మూవీ ఫస్ట్ డే ఎంత రాబట్టిందో మీరే చూసేయండి!
బడ్డీ అంటూ వచ్చిన శిరీష్
టాలెంటెడ్ గాయ్ అల్లు శిరీష్ హీరోగా నటించిన తాజా సినిమానే 'బడ్డీ'. మెడికో థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని సామ్ ఆంటన్ తెరకెక్కించాడు. ఈ మూవీని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఇందులో గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా రాజేశ్ సింగ్, ఆలీ నటించారు. హిప్ హప్ తమీజా మ్యూజిక్ ఇచ్చాడు.

బడ్డీ మూవీ బిజినెస్ ఇలా
తెలుగు రాష్ట్రాల్లో అల్లు శిరీష్‌కు పెద్దగా మార్కెట్ లేదు. అందుకు అనుగుణంగానే అతడు నటించిన తాజా చిత్రం 'బడ్డీ' సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు ఆశించిన రీతిలో ఏర్పడలేదు. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలకు కలిపి రూ. 4.00 కోట్లు మేర బిజినెస్ అయినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీనికితోడు టికెట్ రేట్లనూ తగ్గించేశారు.
డీసెంట్ టాక్‌తో తక్కువ
మెడికో థ్రిల్లర్ అండ్ ఫాంటసీ స్టోరీతో వచ్చిన 'బడ్డీ' మూవీ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మంచి టాక్ రాలేదు. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా ఆశించిన రీతిలో కాకుండా తక్కువగానే లభించింది. ఫలితంగా ఈ చిత్రానికి డల్ కలెక్షన్లే వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేశాయి.

తొలి రోజు అన్ని లక్షలే
'బడ్డీ' మూవీకి టాక్‌కు తగ్గట్లుగానే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువగా రెస్పాన్స్ లభించింది. ఫలితంగా ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కేవలం రూ. 25 లక్షలు వరకూ షేర్ మాత్రమే వసూలు చేసింది. అలాగే, రూ. 45 లక్షలు గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా మిగిలిన ఏరియాలు కలిపి రూ. 30 లక్షలు షేర్, రూ. 55 లక్షలు మాత్రమే గ్రాస్ రాబట్టింది.
ఎంత వసూలు చేయాలి?
వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన 'బడ్డీ' సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలూ కలుపుకుని రూ. 4.00 కోట్లు వరకూ థియేట్రికల్ బిజినెస్ చేసుకున్నట్లు తెలిసింది. అంటే ఈ చిత్రం రూ. 4.50 కోట్లు షేర్ రాబట్టాలి. ఇది తొలి రోజు రూ. 30 లక్షలు షేర్ మాత్రమే రాబట్టింది. అంటే ఇంకా రూ. 4.20 కోట్లు షేర్ వసూలు అయితేనే ఇది క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.


Click it and Unblock the Notifications











