Urvasivo Rakshasivo Pre Release bussiness: అల్లు శిరీష్ బాక్సాఫీస్ టార్గెట్ ఫిక్స్.. థియేటర్స్ కౌంట్ ఎంతంటే?

అల్లు శిరీష్ అను ఇమ్మాన్యూయేల్ జంటగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా నవంబర్ 4వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న అల్లు శిరీష్ ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ట్రైలర్ ఇప్పటికే ఓవర్గం ప్రేక్షకులను ఇంతగానో ఎట్రాక్ట్ చేసింది. సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా హైలెట్ కానున్నట్లు ట్రైలర్ తోనే క్లారిటీ ఇచ్చేశారు.

అంతేకాకుండా మొదటిసారి అల్లు శిరీష్ లిప్ లాక్ సన్నివేశాలలో కూడా నటించడంతో మీడియాలో చాలా హాట్ టాపిక్ గా మారిపోయాడు. నేటితరం యువత ఎదుర్కొంటున్న ఒక సమస్యను ఈ సినిమాలో హైలెట్ చేసినట్లు కూడా క్లారిటీ ఇచ్చారు. అల్లు శిరీష్ తప్పకుండా ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటాడు అని చిత్ర యూనిట్ సభ్యులు కూడా పలు ఇంటర్వ్యూలలో క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ఈ సినిమా ఎన్ని థియేటర్లలో విడుదల కాబోతోంది అలాగే ఏ స్థాయిలో బిజినెస్ చేయబోతుంది అనే వివరాల్లోకి వెళితే.

Allu sirish Urvasivo Rakshasivo movie Pre Release bussiness and theatres count

మొదట ఈ సినిమా టైటిల్ తోనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక ట్రైలర్ టీజర్ అంచనాలను పెంచడంతో డిమాండ్ కూడా పెరిగింది. ఇక సినిమా బజ్ కు తగ్గట్టుగానే బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఊర్వశివో రాక్షసివో సినిమా నైజాంలో 100 థియేటర్లకు పైగా విడుదలవుతుండగా సీడెడ్ లో 45 థియేటర్లలో విడుదలవుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో 130 ధియేటర్లకు పైగా విడుదల చేయబోతున్నారు.

మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తంలో 275 పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే థియేటర్ల సంఖ్య 425 పైగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బిజినెస్ ఏ స్థాయిలో చేసింది అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకు మంచి డిమాండ్ అయితే ఏర్పడడంతో దాదాపు 6 కోట్లకు పైగానే బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఊర్వశివో రాక్షసివో సినిమా 7 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావాలి అంటే 7.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X