Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Alludu adhurs Box office: 4వ రోజు కలెక్షన్స్.. బెల్లంకొండ శ్రీనివాస్ లెక్క ఎంతవరకు వచ్చిందంటే..
సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ దాదాపు పోటాపోటీగానే నడుస్తోంది. ఈ సారి పెద్ద హీరోల కంటే మీడియం హీరోలు డేర్ చేసి కరోనా టైమ్ లో రంగంలోకి దిగారు. అయితే సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే కరోనా ఏ రేంజ్ లో ఉన్నా కలెక్షన్స్ పై ఏ మాత్రం ఎఫెక్ట్ పడదని ఋజువయ్యింది. ఇక అల్లుడు అదుర్స్ ఈ నెల 14న విడుదలవ్వగా పరవలేదనిపించే విధంగా ఓపెనింగ్స్ ను అందుకుంది.
PICS: Srilanka Actress Piumi Hansamali Photos goes viral on internet Photos
దాదాపు ఐదేళ్ల తరువాత
కందిరీగ, రభస, హైపర్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సంతోష్ శ్రీనివాస్ దాదాపు ఐదేళ్ల తరువాత అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వరుస ప్లాప్స్ లలో ఉన్న ఈ దర్శకుడు ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలని అల్లుడు అదుర్స్ సినిమాతో సంక్రాంతి బరిలోకి వచ్చాడు. అయితే సినిమా పెద్దగా పాజిటివ్ టాక్ ను అయితే అందుకోలేదు.
కలెక్షన్స్ డోస్ కొంత కూడా పెరగలేదు
బెల్లంకొండ శ్రీనివాస్ గత సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా లాభాలను అందించలేకపోయాయి. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా అల్లుడు అదుర్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేశారు కానీ మొదటి రోజు తప్పితే ఆ తరువాత రోజులలో కలెక్షన్స్ డోస్ కొంత కూడా పెరగలేదు.
4వ రోజు కలెక్షన్స్..
ఇక 4వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. సినిమా ఆల్ మోస్ట్ ప్రాఫిట్స్ లోకి వచ్చినట్లు ప్రచారాలు బాగానే చేస్తున్నారు గాని ఇంకా సరైన క్రమంలో ప్రాఫిట్ జోన్ లోకి అయితే రాలేదు. అల్లుడు అదుర్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తెలుగు రాష్ట్రాల్లో రూ9.8కోట్లు. ఇక నాలుగవ రోజు మాత్రం కనీసం కోటి రూపాయల షేర్స్ కూడా దక్కలేదు. కేవలం 0.73కోట్లు మాత్రమే వచ్చింది.
ఇప్పటివరకు వచ్చిన మొత్తం కలెక్షన్స్
ఇక ఇప్పటివరకు మొత్తం వచ్చిన కలెక్షన్స్ ఎంతంటే.. తెలుగు రాష్ట్రాల్లో 5.94కోట్లు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన షేర్స్ మొత్తం 6.10కోట్లు. లాభాల్లోకి రావాలి అంటే ఇంకా 3.70కోట్లు సాధించాలి. కానీ నార్మల్ డేస్ లో సినిమా ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుందనేది హాట్ టాపిక్ గా మారింది. శనివారం, ఆదివారమే మిగతా సినిమాలకు పోటీ ఇవ్వలేకపోయిన అల్లుడు ఈ సోమవారం నుంచి ఎంతవరకు పోటీని ఇస్తాడో చూడాలి.