Box office: 6వ రోజు అల్లుడు అదుర్స్ డౌన్.. రెడ్ సినిమాకు వచ్చింది ఎంతంటే?
పొంగల్ ఫైట్ ఈ సారి చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగింది గాని కరోనా దెబ్బ వల్ల గతంలో మాదిరిగా ఊహించని స్థాయిలో కొందరికి అయితే కలెక్షన్స్ దక్కలేదు. సంక్రాంతి అంటేనే సినిమా పెట్టినపెట్టుబడికి డబుల్ ప్రాఫిట్స్ అందించే సీజన్. కానీ కరోనా దెబ్బతో పాటు ఈ సారి కొన్ని సినిమాలు అనుజున్నంత రేంజ్ హిట్ టాక్ తో వండర్స్ క్రియేట్ చేయలేకపోయాయి. అసలు కరోనా టైమ్ లో జనాలు థియేటర్స్ కు వస్తారా రారా అనే బిగ్ కన్ఫ్యూజన్ లో సినిమాలను రిలీజ్ చేయడం రిస్క్ అనుకున్నారు. ఇక ఒకే రోజు విడుదలైన రెడ్, అల్లుడు అదుర్స్ కలెక్షన్స్ పై ఒక లుక్కిస్తే..

టాలీవుడ్ చాలా లక్కీ..
మన సినిమాలకు ఉన్న క్రేజ్ ఏమిటో మరోసారి అర్ధమయ్యింది. ఒక విధంగా ఇలాంటి ఆడియెన్స్ ఉన్నందుకు టాలీవుడ్ కు ఎంతో అదృష్టమనే చెప్పాలి. రామ్ పోతినేని నటించిన రెడ్ సినిమా అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమా ఒకేరోజు వెండితెరపైకి వచ్చాయి. జనవరి 14న సినిమాలు రెండు కూడా పోటాపోటీగా థియేటర్స్ ను దక్కించుకొని గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటిరోజే ఎవరికి వారు మంచి ఓపెనింగ్స్ ను అయితే అందుకున్నారు.

రెడ్ 6వ రోజు రెడ్ కలెక్షన్స్
రామ్ పోతినేని రెడ్ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. నేను శైలజా ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ తమిళ్ రీమేక్ కథ ఓ వర్గం అభిమానులను బాగానే ఎట్రాక్ట్ చేసింది. మొదటి రోజే 5కోట్ల షేర్స్ తో నిర్మాతకు ధైర్యాన్ని అందించింది. ఇక రెండవ రోజు కూడా అదే ఫ్లోలో వెళ్లిన ఈ సినిమా 6వ రోజు మాత్రం కాస్త తగ్గింది. మంగళవారం 79లక్షల షేర్స్ ను అందుకుంది.
Recommended Video

లాభల్లోకి తెచ్చిన రామ్
ఇక రెడ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు వచ్చిన మొత్తం షేర్ కలెక్షన్స్ రూ.16.46కోట్లు. ఇక వరల్డ్ వైడ్ గా వచ్చిన మొత్తం షేర్స్ 17.52కోట్లు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14.5కోట్లు మాత్రమే. అంటే ఇప్పటికే మూడు కోట్లకు పైగా ప్రాఫిట్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. చూస్తుంటే రామ్ ఈ వారంలో కూడా మరికొంత లాభాలు అందించేలా ఉన్నాడని అనిపిస్తోంది.

తగ్గిన అల్లుడు అదుర్స్ కలెక్షన్స్
బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ విషయానికి వస్తే 5వ రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కేవలం 28లక్షల షేర్స్ ను మాత్రమే అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా వచ్చిన మొత్తం షేర్స్ 6.86కోట్లు. అయితే బెల్లంకొండ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.8కోట్లు. కలెక్షన్స్ ఇంకా పెరగాలి. ప్రాఫిట్ జోన్ లోకి రావాలి అంటే మరో మూడు కోట్లను వీలైనంత త్వరగా రబట్టాలి. మరి ఈ వారంలో కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు అందుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











