Box office: అల్లుడు అదుర్స్.. రెడ్ సినిమాల పనైపోయింది.. టోటల్ క్లోజింగ్ కలెక్షన్స్
సంక్రాంతి అంటేనే సినిమాలకు ఒక పెద్ద ఫెస్టివల్. ఎలాంటి సినిమా రిలీజ్ చేసినా కూడా ఎంత కొంత పెట్టినపెట్టుబడికి ప్రాఫిట్స్ అందించే సీజన్ కాబట్టి చాలా మంది సంక్రాంతికే వస్తుంటారు. మొత్తానికి క్రాక్ , మాస్టర్ సినిమాలు బాక్సాఫీస్ కు ఒక మంచి బూస్ట్ ఇచ్చి భవిష్యత్తు సినిమాలకు ధైర్యాన్ని కూడా ఇచ్చాయి. ఇక కరోనా దెబ్బతో పాటు ఈ సారి కొన్ని సినిమాలు అనుకున్నంత రేంజ్ హిట్ టాక్ తో వండర్స్ క్రియేట్ చేయలేకపోయాయి. ఇక ఒకే రోజు విడుదలైన రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాల ఆటలు ముగిశాయి. వాటి మొత్తం కలెక్షన్స్ ఎంతంటే..

ఒకేసారి పోటీకి దిగిన హీరోలు
యువ హీరో రామ్ పోతినేని నటించిన రెడ్ సినిమా అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమా ఒకేరోజు వెండితెరపైకి వచ్చాయి. జనవరి 14న సినిమాలు రెండు కూడా పోటాపోటీగా థియేటర్స్ ను దక్కించుకొని గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటిరోజే ఎవరికి వారు మంచి ఓపెనింగ్స్ ను అయితే అందుకున్నారు.

అల్లుడు అదుర్స్ క్లోజింగ్ కలెక్షన్స్..
ముందుగా అల్లుడు అదుర్స్ విషయానికి వస్తే సినిమా 9.8కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లోకి వచ్చింది. ఇక నిన్నటితో సినిమా బిజినెస్ క్లోజ్ అయ్యింది. ఇక వరల్డ్ వైడ్ గా వచ్చిన మొత్తం షేర్స్ 7.78కోట్లు. అయితే బెల్లంకొండ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.8కోట్లు. కలెక్షన్స్ ఇంకా రావాల్సింది. గత వారం నుంచి కూడా కనీసం కోటి రూపాయల షేర్ అందుకోలేకపోయింది. ఇక ఫైనల్ గా సినిమా 2.02కోట్ల వరకు నష్టపోయింది.

మొదటిరోజే స్ట్రాంగ్ వసూళ్లు
ఇక రామ్ పోతినేని రెడ్ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. నేను శైలజా ఫేమ్ కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ తమిళ్ రీమేక్ కథ ఓ వర్గం అభిమానులను బాగానే ఎట్రాక్ట్ చేసింది. మొదటి రోజే 5కోట్ల షేర్స్ తో నిర్మాతకు ధైర్యాన్ని అందించింది. ఇక రెండవ రోజు కూడా అదే ఫ్లోలో వెళ్లిన ఈ సినిమా వారం రోజుల తరువాత మాత్రం హడావుడి కాస్త తగ్గింది.

రెడ్.. తెచ్చిన మొత్తం లాభాలు
ఇక రెడ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం షేర్ కలెక్షన్స్ రూ.18.54కోట్లు. ఇక వరల్డ్ వైడ్ గా వచ్చిన మొత్తం షేర్స్ 19.79కోట్లు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14.5కోట్లు మాత్రమే. అంటే ఇప్పటికే 5.29కోట్ల ప్రాఫిట్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి సినిమా అయితే లాభాలను అందించింది. కానీ రామ్ ఈ సినిమా డబుల్ ప్రాఫిట్స్ ను అందిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికి వర్కౌట్ కాలేదు.


Click it and Unblock the Notifications











