Don't Miss!
- Sports SRH vs MI: ఆ దిగ్గజ క్రికెటర్ వల్లనే చరిత్ర సృష్టించా- అభిషేక్ శర్మ
- News విజయవాడ పశ్చిమ సీటులో మారిపోయిన లెక్కలు !
- Automobiles ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Lifestyle Car Vastu Tips: కారు ఉందా అయితే ఈ వాస్తు నియమాలు పాటించండి..ఈ డైరెక్షన్ లో పార్క్ చేస్తే
- Technology Poco నుంచి F సిరీస్ లో కొత్త ఫోన్! స్పెసిఫికేషన్లు లీక్, వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
Box office: 5వ రోజు రెడ్, అల్లుడు అదుర్స్ కలెక్షన్స్.. రామ్ టార్గెట్ ఫినిష్.. ఇంకా పైకిరాని బెల్లంకొండ
సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ ఈ సారి చాలా ఆసక్తికరంగా కొనసాగుతోంది. అసలు కరోనా టైమ్ లో జనాలు థియేటర్స్ కు వస్తారా రారా అనే బిగ్ కన్ఫ్యూజన్ లో సినిమాలను రిలీజ్ చేయడం రిస్క్ అనుకున్నారు. కానీ మన సినిమాలకు ఉన్న క్రేజ్ ఏమిటో మరోసారి అర్ధమయ్యింది. ఒక విధంగా ఇలాంటి ఆడియెన్స్ ఉన్నందుకు టాలీవుడ్ కు ఎంతో అదృష్టమనే చెప్పాలి. ఇక ఒకే రోజు విడుదలైన రెడ్, అల్లుడు అదుర్స్ కలెక్షన్స్ పై ఒక లుక్కిస్తే..
Recommended Video
PICS: ఇండియన్ కపుల్స్.. వైరల్ ఫోటోషూట్
పోటాపోటీగా..
రామ్ పోతినేని నటించిన రెడ్ సినిమా అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమా ఒకేరోజు వెండితెరపైకి వచ్చాయి. జనవరి 14న సినిమాలు రెండు కూడా పోటాపోటీగా థియేటర్స్ ను దక్కించుకొని గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటిరోజే ఎవరికి వారు మంచి ఓపెనింగ్స్ ను అయితే అందుకున్నారు.
5వ రోజు రెడ్ కలెక్షన్స్
ముందుగా రామ్ రెడ్ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ తమిళ్ రీమేక్ కథ ఓ వర్గం అభిమానులను బాగానే ఎట్రాక్ట్ చేసింది. మొదటి రోజే 5కోట్ల షేర్స్ తో నిర్మాతకు ధైర్యాన్ని అందించింది. ఇక రెండవ రోజు కూడా అదే ఫ్లోలో వెళ్లిన ఈ సినిమా 5వ రోజు మాత్రం కాస్త తగ్గింది. సోమవారం కోటికి పైగా షేర్స్ ను అందుకుంది.
రెడ్ సినిమా.. లాభాల్లోకి
ఇక రెడ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు వచ్చిన మొత్తం షేర్ కలెక్షన్స్ రూ.15.67కోట్లు. ఇక వరల్డ్ వైడ్ గా వచ్చిన మొత్తం షేర్స్ 16.67కోట్లు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 14.5కోట్లు మాత్రమే. అంటే ఇప్పటికే రెండు కోట్లకు పైగా ప్రాఫిట్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. చూస్తుంటే రామ్ ఈ వారంలో కూడా మరిన్ని లాభాలు అందించేలా ఉన్నాడని అనిపిస్తోంది.
అల్లుడు అదుర్స్.. ఇంకా ఎంత రావాలి
ఇక బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ విషయానికి వస్తే 5వ రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కేవలం 0.47కోట్ల షేర్స్ ను మాత్రమే అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా వచ్చిన మొత్తం షేర్స్ 6.58కోట్లు. అయితే బెల్లంకొండ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.8కోట్లు. కలెక్షన్స్ ఇంకా పెరగాలి. ప్రాఫిట్ జోన్ లోకి రావాలి అంటే మరో నాలుగు కోట్లను వీలైనంత త్వరగా రబట్టాలి. మరి ఈ వారంలో కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు అందుతాయో చూడాలి.