‘అల్లుడు శీను’ ఫస్ట్ వీకెండ్(3డేస్) కలెక్షన్స్...
హైదరాబాద్: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అల్లుడు శీను' చిత్రం ఫస్ట్ వీకెండ్ (శుక్ర, శని, ఆది) మంచి వసూళ్లు రాబట్టింది. హీరో కొత్తవాడే అయినా....వివి వినాయక్ దర్శకత్వం, సమంత అందాలు, తమన్నా ఐటం సాంగ్, బ్రహ్మానందం కామెడీ అనే అంశాలు ఉండటంతో మంచి ఓపెనింగ్స్ సాధించింది.

కథ, కథనం యావరేజ్‌గా ఉన్నా...పెర్ఫార్మెన్స్ పరంగా సాయి శ్రీనివాస్ ఓకే అనిపించుకున్నాడు. ఈ చిత్రం తొలి మూడురోజుల్లో ఏరియావైజ్ సాధించిన కలెక్షన్ల వివరాలపై ఓ లుక్కేద్దాం....
నైజాం: 2.37 కోట్లు
సీడెడ్: 1.39 కోట్లు
గుంటూరు: 93 లక్షలు
కృష్ణా: 57.32 లక్షలు
ఈస్ట్ గోదావరి: 54 లక్షలు
వెస్ట్ గోదావరి: 49.50లక్షలు
ఉత్తరాంధ్ర: 86లక్షలు
నెల్లూరు : 32 లక్షలు
కర్ణాటక: 80 లక్షలు
రెస్టాఫ్ ఇండియా: 20 లక్షలు
ఓవర్సీస్: 20 లక్షలు
వరల్డ్ వైడ్ మొత్తం: 8.67 కోట్లు
బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం వినాయక్ మార్క్ ఎంటర్టెనర్‌గా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ వీక్షించారు. సినిమా చూసి అనంతరం చిరంజీవి స్వయంగా వినాయక్‌కు ఫోన్ చేసి మంచి కమర్షియల్ ఎంటర్టెనర్ తీసావని మెచ్చుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా సాయిశ్రీనివాస్‌ను కూడా విష్ చేసినట్ల సమాచారం. ఏకంగా చిరంజీవి నుండి ఫోన్ రావడంతో సాయి శ్రీనివాస్ చాలా సంతోషంగా ఉన్నాడట.


Click it and Unblock the Notifications











