Alpha Day 1 Box Office: షాకింగ్‌గా అల్ఫా మూవీ కలెక్షన్లు.. ఆలియాభట్ మూవీకి ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ అల్ఫా. హీరో, నిర్మాత ఉదయ్ చోప్రా కథను అందించగా. ఈ సినిమాకు శివ్ రవైల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ ఆలియా భట్, శర్వరి, అనిల్ కపూర్, బాబీ డియోల్, దివ్యేందు భట్టాచార్య నటించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అతిథి పాత్రలో కనిపించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి: రుబియాస్, ఎడిటింగ్: ఆరిఫ్ షేక్, మ్యూజిక్: రోహన్ష్, అబీర్ పండిట్, బ్యాక్ గ్రౌైండ్ స్కోర్: సంచిత్ అం్ అంకిత్ బెహ్రా తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ చిత్రం జూలై 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

Alpha Day 1 Box Office Collections

యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌లోని స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన ఈ సినిమాను ఖర్చుకు వెనుకాడకుండా భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఈ సినిమాలో నటించిన యాక్టర్లు, పనిచేసిన టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 125 కోట్ల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 150 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది అని తెలిపారు.

ఇప్పటి వరకు వచ్చిన స్పై యూనివర్స్ సినిమాలతో పోల్చుకొంటే ఈ మూవీకి పెద్దగా స్పందన కనపించలేదు. ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ కూడా ఆశించినంత మేరకు నమోదు కాలేదు. ఈ చిత్రానికి సుమారుగా 2 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కలెక్షన్లు నమోదు అయ్యాయి. దాంతో ఈ మూవీ రిలీజ్ తర్వాత మౌత్ టాక్‌తో పుంజుకొంటుందా? లేదా బోల్తా కొడుతుందా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతున్నది.

అల్ఫా సినిమా థియేట్రికల్ రిలీజ్ విషయానికి వస్తే.. ఈ సినిమాను 32 రాష్ట్రాల్లో 550 నగరాల్లో, 150 లోకేషన్లలో, 2 వేల స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా తొలి రోజు 60 షోలు ప్రదర్శిస్తుండగా, 25 ఆక్యుపెన్సీ నమోదు చేసుకొన్నది. ఇండియాలో మొదటి రోజు 2 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం 6 నుంచి 7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం.. మహారాష్ట్రలో 1 కోటికి పైగా, ఢీల్లీలో 1 కోటి రూపాయలు, కర్ణాటకలో 50 లక్షలు, గుజరాత్‌లో 45 లక్షలు, ఉత్తర ప్రదేశ్‌లో 40 లక్షలు, పశ్చిమ బెంగాల్‌లో 35 లక్షలు, రాజస్థాన్‌లో 25 లక్షలు, తెలంగాణలో 20 లక్షల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు, ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ కలెక్షన్ల ఆధారంగా తమ రిపోర్టులో వెల్లడించాయి.

Read more about: Alpha alia bhatt bobby deol
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X