Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అనుష్క, అల్లు అర్జున్ ఇద్దరి వల్ల కానిది.. సమంత మాత్రం చేసి చూపెట్టింది
అక్కినేని సమంత ఫుల్ జోష్ మీద ఉంది. ఆమె తాజాగా నటించిన చిత్రం 'ఓ బేబి' ఫలితమే దీనికి కారణం. కొరియన్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో సమంతతో పాటు సీనియర్ నటి లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. జూలై మొదటి వారంలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ విజయవంతంగానే ప్రదర్శితమవుతోంది. ఈ మధ్య పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినా 'ఓ బేబి'కి ప్రేక్షకాదరణ మాత్రం తగ్గడం లేదు. దీంతో చిత్ర యూనిట్ దీనిపై హ్యాపీగా ఉంది.
'ఓ బేబి' మొదటి వీకెండ్ ముగిసే సమయానికి మొత్తంగా రూ. 17 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. అలాగే, ఓవర్సీస్లోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలోనే మిలియన్ డాలర్ మార్కుకు చేరువైంది. తాజాగా ఈ సినిమా ఓ రికార్డును సాధించింది. గతంలో అనుష్క ప్రాధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రం 'రుద్రమ దేవి'. ఇందులో అల్లు అర్జున్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా ఓవర్సీస్లో 970 డాలర్లను సంపాదించింది. ఈ రికార్డును సమంత 'ఓ బేబి' క్రాస్ చేసింది. అంతేకాదు, మిలియన్ డాలర్ క్లబ్‌కు మరింత చేరువైంది.
నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత అక్కినేని నటించిన చిత్రం 'ఓ బేబీ'లో లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై సురేష్ బాబు, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్‌లు తెరకెక్కించారు. 'మిస్ గ్రానీ' అనే కొరియన్ చిత్రానికి ఇది రీమేక్. దీనిని బాలీవుడ్‌లోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్.