twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనుష్క, అల్లు అర్జున్ ఇద్దరి వల్ల కానిది.. సమంత మాత్రం చేసి చూపెట్టింది

    |

    అక్కినేని సమంత ఫుల్ జోష్ మీద ఉంది. ఆమె తాజాగా నటించిన చిత్రం 'ఓ బేబి' ఫలితమే దీనికి కారణం. కొరియన్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో సమంతతో పాటు సీనియర్ నటి లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. జూలై మొదటి వారంలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ విజయవంతంగానే ప్రదర్శితమవుతోంది. ఈ మధ్య పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినా 'ఓ బేబి'కి ప్రేక్షకాదరణ మాత్రం తగ్గడం లేదు. దీంతో చిత్ర యూనిట్ దీనిపై హ్యాపీగా ఉంది.

    'ఓ బేబి' మొదటి వీకెండ్‌ ముగిసే సమయానికి మొత్తంగా రూ. 17 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. అలాగే, ఓవర్సీస్‌లోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలోనే మిలియన్ డాలర్ మార్కుకు చేరువైంది. తాజాగా ఈ సినిమా ఓ రికార్డును సాధించింది. గతంలో అనుష్క ప్రాధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రం 'రుద్రమ దేవి'. ఇందులో అల్లు అర్జున్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా ఓవర్సీస్‌లో 970 డాలర్లను సంపాదించింది. ఈ రికార్డును సమంత 'ఓ బేబి' క్రాస్ చేసింది. అంతేకాదు, మిలియన్ డాలర్ క్లబ్‌కు మరింత చేరువైంది.

    amantha akkineni Oh Baby Beats Rudhramadevi

    నందినీ రెడ్డి దర్శకత్వంలో స‌మంత అక్కినేని నటించిన చిత్రం 'ఓ బేబీ'లో ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై సురేష్ బాబు, సునీత తాటి, టీజీ విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్‌లు తెరకెక్కించారు. 'మిస్ గ్రానీ' అనే కొరియన్ చిత్రానికి ఇది రీమేక్. దీనిని బాలీవుడ్‌లోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్.

    English summary
    Samantha akkineni Recent Movie Oh Baby Runs successfully. This Movie Erned Rs 17 Cr gross In Just First 3 Days. And According To Trade Reports Oh Baby Beats Rudhramadevi In Overseas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X