Amaran Day 10 Collections : 200 కోట్లు ఫినిష్ .. లెక్కలు తేలుస్తోన్న సాయి పల్లవి, 10వ రోజు ఎన్ని కోట్లంటే?

దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ అమరన్. విలక్షణ నటుడు కమల్ హాసన్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రంలో శివ కార్తీకేయన్, సాయిపల్లవి తదితరులు నటించారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్, సోని పిక్చర్స్ సంయుక్తంగా రూపొందించిన అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. రెండవ వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా నేటికీ కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. ఈ మూవీ వసూళ్ల వివరాల్లోకి వెళితే..

నటీనటులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రచార ఖర్చులతో కలిపి అమరన్ సినిమాను దాదాపు రూ. 130 కోట్లతో నిర్మించారు. టీజర్, ట్రైలర్‌‌తో పాటు ముకుందు వరదరాజన్ జీవితాన్ని తెరపై ఎలా ఆవిష్కరించారోనన్న ఉత్కంఠ నేపథ్యంలో అమరన్‌పై భారీ అంచనాలున్నాయి. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. అమరన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.65 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. తమిళనాడు హక్కులు 40 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్, నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దీంతో అమరన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 67 కోట్లుగా విలువ కట్టారు ట్రేడ్ పండితులు.

Amaran Day 10 Collections world wide here s the details

10 రోజులు కావోస్తున్నా బాక్సాఫీస్ వద్ద అమరన్‌ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు ఈ సినిమాకు దాదాపు 3.41 మిలియన్ల టికెట్లు బుక్కయ్యాయి. శనివారం నాడు సింగం ఎగైన్, భూల్ భూలయ్య 3 టికెట్ల అమ్మకాలను అమరన్ అధిగమించాడు. బీబీ 3కు 280కే టికెట్లు అమ్ముడవ్వగా.. సింగమ్ ఎగైన్ 190కే టికెట్ల విక్రయాలను చూసింది. అమరన్ 325కే టికెట్ బుకింగ్స్‌తో ఈ రెండు చిత్రాలను అధిగమించాడు.

ఇక 10వ రోజు అమరన్ వసూళ్ల విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా శనివారం ఈ సినిమా రూ. 17 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. 10వ రోజు తమిళనాడులో రూ. 11 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 3 కోట్లు, హిందీ, కేరళ, కన్నడ, ఓవర్సీస్ కలుపుకుని రూ. 3 కోట్లు కలుపుకుని మొత్తంగా రూ. 17 కోట్ల గ్రాస్ రాబట్టింది.

శివ కార్తీకేయన్ దాదాపు నాలుగో రోజుతో సమానంగా కలెక్షన్లు రాబట్టడం విశేషం. ఇక పదవ రోజు వసూళ్లను కలుపుకుని అమరన్ రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నటుడిగా శివకార్తీకేయన్‌కు ఇదే తొలి రూ. 200 కోట్ల సినిమా. ఇందులో దాదాపు రూ. 140.50 కోట్లు ఇండియా నుంచి రాగా.. మిగిలినదంతా ఓవర్సీస్‌ నుంచే రాబట్టాడు అమరన్. ఒక్క తమిళనాడు నుంచే రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం. ఈ లెక్కన సెకండ్ వీక్ ముగిసే నాటికి అమరన్ రూ. 250 కోట్ల మార్క్‌ను అవలీలగా అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Read more about: sivakarthikeyan sai pallavi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X