Amaran Day 11 Collections : బాక్సాఫీస్‌పై అమరన్ దండయాత్ర .. సాయి పల్లవి మూవీకి ఎన్ని కోట్లంటే?
స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ అమరన్ . భారత సైన్యం సాహసాలు, సైనికుల కుటుంబాల త్యాగాలు, ఇంటి పెద్ద దూరమైతే వారి కుటుంబాలు పడే ఆవేదనను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. మేజర్ ముకుంద్ వరదరాజన్‌గా శివకార్తీకేయన్ ఆయన సతీమణి ఇందు రెబాకా వర్గీస్‌గా సాయి పల్లవి ఒదిగిపోయారు. 10 రోజుల్లో రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన అమరన్.. 11వ రోజు ఎలాంటి వసూళ్లను సాధించిందో చూస్తే :
విలక్షణ నటుడు కమల్ హాసన్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్, సోని పిక్చర్స్ సంయుక్తంగా రూపొందించిన అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. రెండవ వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా నేటికీ కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. నటీనటులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రచార ఖర్చులతో కలిపి అమరన్ సినిమాను దాదాపు రూ. 130 కోట్లతో నిర్మించారు.

టీజర్, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన రావడంతో అమరన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. అమరన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.65 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. తమిళనాడు హక్కులు 40 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్, నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దీంతో అమరన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 67 కోట్లుగా విలువ కట్టారు ట్రేడ్ పండితులు.
తొలి వారం ఇండియా వైడ్‌గా రూ.114.85 కోట్ల వసూళ్లను రాబట్టింది అమరన్. ఇందులో ఒక్క తమిళనాడు నుంచే రూ.93 కోట్లు రాగా.. తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 21.2 కోట్లు, కర్ణాటకలో రూ. 30 లక్షలు, హిందీలో రూ. 31 లక్షలు, కేరళలలో రూ. 4 లక్షలు వసూళ్లు సాధించింది. 10 రోజుల నాటికే రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన అమరన్.. శివకార్తీకేయన్ కెరీర్‌లో తొలి రూ. 200 కోట్ల మూవీగా నిలిచింది.

ఇక 11వ రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 16 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి దుమ్మురేపింది. మొత్తంగా 11 రోజుల వరకు అమరన్ వరల్డ్ వైడ్‌గా రూ. 216.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తమిళనాడు నుంచి రూ. 124 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ, 28.86 కోట్లు, హిందీలో రూ. 61 లక్షలు, కన్నడంలో రూ. 37 లక్షలు, మలయాళంలో రూ. 4 లక్షలు, ఓవర్సీస్ నుంచి రూ. 59 కోట్ల వసూళ్లు వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ జోరు ఇలాగే కొనసాగితే సెకండ్ వీక్ ముగిసే నాటికి అమరన్ రూ. 250 కోట్ల మార్క్‌ను అవలీలగా అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











