Amaran Day 12 Collections : దెబ్బేసిన వసూళ్లు .. 12వ రోజు సాయి పల్లవి మూవీకి ఎన్ని కోట్లంటే?

స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ అమరన్ . శివ కార్తీకేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం 11 రోజుల్లోనే రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్చపరుస్తోంది. శివ కార్తీకేయన్, సాయి పల్లవిల కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో పాటు ఈ ఏడాది రిలీజైన తమిళ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. మరి ఈ సినిమా 12వ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే

విలక్షణ నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్‌తో పాటు సోని పిక్చర్స్‌తో కలిసి సంయుక్తంగా అమరన్ నిర్మించారు. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. రెండవ వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా నేటికీ కలెక్షన్ల విషయంలో తగ్గడం లేదు. నటీనటులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రచార ఖర్చులతో కలిపి అమరన్ సినిమాను దాదాపు రూ. 130 కోట్లతో నిర్మించారు.

తొలి నుంచి టీజర్, ట్రైలర్‌‌లకు మంచి రెస్పాన్స్ రావడం, శివ కార్తీకేయన్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తుండటం , పైగా సాయి పల్లవి హీరోయిన్ కావడంతో అమరన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. అమరన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.65 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. తమిళనాడు హక్కులు 40 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్, నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దీంతో అమరన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 67 కోట్లుగా విలువ కట్టారు ట్రేడ్ పండితులు.

తొలి వారం ఈ సినిమా ఇండియా వైడ్‌గా రూ.114.85 కోట్ల వసూళ్లను రాబట్టగా.. 10 రోజుల నాటికే రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తద్వారా శివకార్తీకేయన్ కెరీర్‌లో తొలి రూ. 200 కోట్ల మూవీగా నిలిచింది. ఆదివారం వరకు కుమ్మిపడేసిన అమరన్.. సోమవారం నుంచి వర్కింగ్ డే స్టార్ట్ కావడంతో బుకింగ్స్ దారుణంగా పడిపోయాయి. 12వ రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 6 .5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాడు శివకార్తీకేయన్.

తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు , ఓవర్సీస్ మినహా ఎక్కడా అమరన్ సందడి అంతగా కనిపించడం లేదు. 12వ రోజు తమిళనాడులో రూ. 4 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.72 కోట్లు , హిందీలో రూ. 6 లక్షలు చొప్పున వసూళ్లు వచ్చాయి. గురువారం సూర్య కంగువా, వరుణ్ తేజ్ మట్కా సినిమాలు రిలీజ్ కానుండటంతో అమరన్‌పై భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో కంగువా కోసం అమరన్ థియేటర్లు చాలా వరకు ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగులో మట్కా దిగడంతో ఇక్కడా ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ రెండు సినిమాల రిజల్ట్ ఆధారంగా అమరన్ బిజినెస్ ఆధారపడి ఉంది.

More from Filmibeat

Read more about: sivakarthikeyan sai pallavi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X