Amaran Day 13 Collections : 250 కోట్లు ఔట్.. బాక్సాఫీస్ వద్ద సాయి పల్లవి మూవీ సంచలనం!

దేశ రక్షణ విధుల్లో ప్రాణ త్యాగం చేసిన స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ అమరన్ . భర్త మరణంతో ఆయన సతీమణి ఇందు రెబెకా వర్గీస్ ఎదుర్కొన్న సంఘర్షణను ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారు. దీపావళి కానుకగా ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. శివ కార్తీకేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ ఇప్పటికే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరింది. మరి 13వ రోజు ఈ బయోపిక్ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

కోలీవుడ్ నట దిగ్గజం కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్‌తో పాటు సోని పిక్చర్స్‌తో కలిసి సంయుక్తంగా అమరన్ నిర్మించారు. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. నటీనటులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రచార ఖర్చులతో కలిపి అమరన్ సినిమాను దాదాపు రూ. 130 కోట్లతో నిర్మించారు.

Amaran Day 13 Collections world wide here s the details

ప్రేమికుడిగా, ఆకతాయి కుర్రాడిగా ఇప్పటి వరకు నటిస్తూ వచ్చిన శివ కార్తీకేయన్ తొలిసారి ఆర్మీ ఆఫీసర్‌గా నటించడం , పైగా సాయి పల్లవి హీరోయిన్ కావడంతో అమరన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ హక్కుల కోసం విపరీతంగా డిమాండ్ నెలకొంది. అమరన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.65 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. తమిళనాడు హక్కులు 40 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్, నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దీంతో అమరన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 67 కోట్లుగా విలువ కట్టారు ట్రేడ్ పండితులు.

తొలి వారం ఈ సినిమా ఇండియా వైడ్‌గా రూ.114.85 కోట్ల వసూళ్లను రాబట్టగా.. 10 రోజుల నాటికే రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తద్వారా శివకార్తీకేయన్ కెరీర్‌లో తొలి రూ. 200 కోట్ల మూవీగా నిలిచింది. 12 రోజుల వరకు అమరన్ రూ. 250 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. తమిళనాడులో రూ. 119.65 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 30.10 కోట్లు, కర్ణాటకలో రూ.17.15 కోట్లు, కేరళలలో రూ. 8.90 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.74 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకు రూ. 57.10 కోట్ల ప్రాఫిట్‌ను బయ్యర్లకు అందించాడు అమరన్.

Amaran Day 13 Collections world wide here s the details

తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు , ఓవర్సీస్ మినహా ఎక్కడా అమరన్ సందడి అంతగా కనిపించడం లేదు. 13వ రోజు తమిళనాడులో రూ. 3. కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. కోటి, హిందీలో రూ. 5 లక్షలు చొప్పున మొత్తంగా 5.15 కోట్ల రేంజ్‌లో వసూళ్లను సాధించింది. గురువారం సూర్య కంగువా, వరుణ్ తేజ్ మట్కా సినిమాలు రిలీజ్ కానుండటంతో అమరన్‌పై భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం.

More from Filmibeat

Read more about: sivakarthikeyan sai pallavi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X