Amaran Day 14 Collections : డల్‌గా అమరన్ వసూళ్లు.. 14వ రోజు సాయిపల్లవి మూవీకి ఎన్ని కోట్లంటే?
దేశం కోసం అమరుడైన స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమే అమరన్ . శివ కార్తీకేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలై రెండు వారాలు గడుస్తుండగా ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మరి 14వ రోజున అమరన్ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
కోలీవుడ్ నట దిగ్గజం కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్‌తో పాటు సోని పిక్చర్స్‌తో కలిసి సంయుక్తంగా అమరన్ నిర్మించారు. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. నటీనటులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రచార ఖర్చులతో కలిపి అమరన్ సినిమాను దాదాపు రూ. 130 కోట్లతో నిర్మించారు.

ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యాయి. శివ కార్తీకేయన్, సాయి పల్లవి క్రేజ్‌కు తగ్గట్లుగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.65 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. తమిళనాడు హక్కులు 40 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్, నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దీంతో అమరన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 67 కోట్లుగా విలువ కట్టారు ట్రేడ్ పండితులు.
13 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 257.65 కోట్ల గ్రాస్.. రూ. 127.10 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో ఇప్పటి వరకు రూ. 60.10 కోట్ల లాభాలను బయ్యర్లకు అందించాడు శివ కార్తీకేయన్. తమిళనాడులో అత్యధికంగా రూ. 122.75 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లో రూ.31.40 కోట్లు, కర్ణాటకలో రూ. 17.65 కోట్లు, కేరళలో రూ. 9.20 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.40 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 74.25 కోట్ల కలెక్షన్లు సాధించింది.

తమిళనాడు తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అమరన్ హవా చూపిస్తున్నాడు. 13 రోజుల వరకు రూ. 31.40 కోట్ల గ్రాస్ .. రూ.18.32 కోట్ల షేర్‌ను ఈ సినిమా సాధించింది. తెలుగులో బ్రేక్ ఈవెన్ మార్క్ రూ.5.50 కోట్లు కాగా.. ఇప్పటికే బయ్యర్లకు రూ. 12.82 కోట్ల లాభాలను తెచ్చిపెట్టాడు అమరన్. నైజాంలో రూ. 8.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.58 కోట్లు, ఆంధ్రాలో రూ.7.24 కోట్ల కలెక్షన్లను అమరన్ సాధించాడు.
ఇక 14వ రోజు వసూళ్ల విషయానికి వస్తే .. తమిళనాడులో రూ. 3.43 కోట్లు, తెలుగులో రూ. 1.31 కోట్లు, హిందీలో రూ. 10 లక్షలు , కన్నడంలో రూ. 4 లక్షల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 5 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. గురువారం నుంచి కంగువా, మట్కా చిత్రాలు రిలీజ్ కానుండటంతో ఈ పోటీని తట్టుకుని అమరన్ ఏ మేరకు నిలబడతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











