Amaran Day 15 Collections : టఫ్ ఫైట్‌లోనూ కుమ్మేసిన సాయి పల్లవి .. అమరన్‌కు ఎన్ని కోట్లంటే?

దేశభక్తి , భారత సైన్యం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా దేశ రక్షణ విధుల్లో అమరుడైన స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ అమరన్ . కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తీకేయన్, లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలై రెండు వారాలు గడుస్తుండగా 15వ రోజున అమరన్ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

విలక్షణ నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్‌తో పాటు సోని పిక్చర్స్‌తో కలిసి సంయుక్తంగా అమరన్ నిర్మించారు. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. నటీనటులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులతో కలిపి అమరన్ సినిమాను దాదాపు రూ. 130 కోట్లతో నిర్మించారు.

Amaran Day 15 Collections world wide here s the details

టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్‌తో భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు ఎగబడ్డారు. దీనికి శివ కార్తీకేయన్, సాయి పల్లవి క్రేజ్‌ కూడా తోడు కావడంతో అమరన్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.65 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. తమిళనాడు హక్కులు 40 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్, నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దీంతో అమరన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 67 కోట్లుగా విలువ కట్టారు ట్రేడ్ పండితులు.

రెండు వారాలకు గాను అమరన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 263.40 కోట్ల గ్రాస్.. రూ.129.75 కోట్ల షేర్ సాధించింది. తమిళనాడులో రూ. 125.40 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 32.60 కోట్లు, కర్ణాటకలో రూ. 18.05 కోట్లు, కేరళలో రూ. 9.55 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 2.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 75.05 కోట్ల చొప్పున వసూళ్లు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ పోను బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు రూ.62.75 కోట్ల లాభాలను అందించింది.

Amaran Day 15 Collections world wide here s the details

తమిళనాడు , ఓవర్సీస్ మార్కెట్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అమరన్ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. తెలుగులో గడిచిన రెండు వారాల్లో ఈ సినిమా రూ. 32.06 కోట్ల గ్రాస్.. రూ. 18.90 కోట్ల షేర్ రాబట్టింది. నైజాంలో రూ. 8.80 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.62 కోట్లు, ఆంధ్రలో రూ.7.48 కోట్లు చొప్పున వసూళ్లు సాధించాడు శివ కార్తీకేయన్. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పోను రూ. 13.40 కోట్ల లాభాలను బయ్యర్లకు అందించాడు మఅరన్.

ఇక 15వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. తమిళనాడులో రూ. 2.30 కోట్లు, కర్ణాటకలో రూ. 3 లక్షలు, హిందీలో రూ. 7 లక్షలు, తెలుగులో రూ. 1.80 కోట్లు, మలయాళంలో రూ.2 లక్షలు చొప్పున మొత్తంగా రూ. 4 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాడు అమరన్. థియేటర్‌లలోకి కంగువా, మట్కా సినిమాలు రావడంతో ఇకపై అమరన్ ఎలా నెట్టుకొస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X