Amaran Day 16 Collections : కంగువాను ఢీకొడుతున్న అమరన్‌‌ .. శివ కార్తీకేయన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

దేశభక్తి , భారత సైన్యం బ్యాక్‌డ్రాప్‌లో స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ అమరన్ . కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తీకేయన్, లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. గడిచిన రెండు వారాలుగా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన అమరన్‌కు నవంబర్ 14 నుంచి గట్టి పోటీ మొదలైంది. కోలీవుడ్ సూపర్‌స్టార్ సూర్య నటించిన కంగువా, టాలీవుడ్ యువ నటుడు మట్కాలు ఒకే రోజు రిలీజవ్వడంతో అమరన్‌పై ఎలాంటి ప్రభావం చూపింది? 16వ రోజు శివ కార్తీకేయన్ - సాయి పల్లవిల మూవీ ఏ రేంజ్‌లో వసూళ్లు సాధించిందో చూస్తే.

తమిళ నట దిగ్గజం కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్‌తో పాటు సోని పిక్చర్స్‌తో కలిసి సంయుక్తంగా అమరన్ నిర్మించారు. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. నటీనటులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులతో కలిపి అమరన్ సినిమాను దాదాపు రూ. 130 కోట్లతో నిర్మించారు.

Amaran Day 16 Collections world wide here s the details

టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్‌కు తోడు శివ కార్తీకేయన్, సాయి పల్లవిల స్టార్ డమ్ కూడా తోడు కావడంతో అమరన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.65 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. తమిళనాడు హక్కులు 40 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్, నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల రూపాయల చొప్పున అమ్ముడుపోయాయి. దీంతో అమరన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 67 కోట్లుగా విలువ కట్టారు ట్రేడ్ పండితులు.

రెండు వారాలకు గాను అమరన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 263.40 కోట్ల గ్రాస్.. రూ.129.75 కోట్ల షేర్ రాబట్టి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు రూ.62.75 కోట్ల లాభాలను అందించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వారాల్లో ఈ సినిమా రూ. 32.06 కోట్ల గ్రాస్.. రూ. 18.90 కోట్ల షేర్ సాధించి రూ. 13.40 కోట్ల లాభాలను అందజేసింది అమరన్.

Amaran Day 16 Collections world wide here s the details

ఇలాంటి దశలో నవంబర్ 14న కంగువా, మట్కా సినిమాలు రిలీజ్ కావడంతో అమరన్ తట్టుకుని నిలబడగలడా అనే చర్చ సినీ వర్గాల్లో నడిచింది. ఈ వారంతో శివ కార్తీకేయన్ మూవీ బిజినెస్ క్లోజ్ చేస్తారని? థియేటర్‌ల నుంచి ఎత్తేస్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో 16వ రోజు అమరన్ వసూళ్లు సాధించిందో చూస్తే . కంగువా, మట్కా వంటి భారీ చిత్రాలు రంగంలోకి దిగినా అమరన్ మూడో వారం ఎక్స్‌లెంట్ హోల్డ్ సాధిస్తోంది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అమరన్‌కు బాగానే బుకింగ్స్ జరిగాయి.

శివ కార్తీకేయన్ - సాయి పల్లవిల చిత్రం 16వ రోజు తమిళనాడులో రూ. 2.42 కోట్లు, కర్ణాటకలో రూ . 3 లక్షలు, హిందీలో రూ. 8 లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.37 కోట్లు , మలయాళంలో రూ. 2 లక్షలు , ఓవర్సీస్‌లో రూ. 46 లక్షల చొప్పున మొత్తంగా రూ. 4.74 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ వీకెండ్ కూడా అమరన్ గట్టిగానే కలెక్షన్లను సాధిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X