Amaran Day 17 Collections : నెక్ టూ నెక్ వార్‌లో అమరన్ ఊచకోత ... 300 కోట్ల దిశగా సాయి పల్లవి మూవీ
శివ కార్తీకేయన్- సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయం దక్కించుకుంది. అంచాలను మించి వసూళ్లను రాబట్టిన ఈ బయోపిక్ మూవీ.. రూ.300 కోట్ల టార్గెట్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ వారం సూర్య నటించిన కంగువా, వరుణ్ తేజ్ నటించిన మట్కాలు రిలీజైనా అమరన్ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో 17వ రోజు శివ కార్తీకేయన్ - సాయి పల్లవిల మూవీ ఏ రేంజ్‌లో వసూళ్లు సాధించిందో చూస్తే.
కోలీవుడ్ సీనియర్ నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్‌తో పాటు సోని పిక్చర్స్‌తో కలిసి సంయుక్తంగా అమరన్ నిర్మించారు. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. నటీనటులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులతో కలిపి అమరన్ సినిమాను దాదాపు రూ. 130 కోట్లతో నిర్మించారు.

టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్‌కు తోడు ఎప్పుడూ సరదాగా ఉండే క్యారెక్టర్లు వేసిన శివ కార్తీకేయన్ ఇందులో ఫస్ట్ టైమ్ సీరియస్ రోల్‌లో, అందులోనూ బయోపిక్ కావడంతో ఆయన ఎలా చేశారోనన్న ఉత్కంఠ నెలకొంది. దీనికి సాయి పల్లవి స్టార్ డమ్ కూడా తోడు కావడంతో అమరన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.65 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తమిళనాడు హక్కులు 40 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్, నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల రూపాయల చొప్పున అమ్ముడుపోయాయి. దీంతో అమరన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 67 కోట్లుగా విలువ కట్టారు ట్రేడ్ పండితులు.
అమరన్ మూవీ 16 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.274 కోట్ల గ్రాస్ .. రూ.135 కోట్ల షేర్‌ను సాధించింది. తమిళనాడులో రూ, 130.45 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 35.70 కోట్లు, కర్ణాటకలో రూ. 18.80 కోట్లు, కేరళలో రూ, 18.80 కోట్లు, కేరళలో రూ. 10.20 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ, 3.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 76 కోట్లు చొప్పున రాబట్టింది. అలా 16 రోజుల్లో రూ. 67 కోట్ల లాభాలను బయ్యర్లకు అందజేశాడు అమరన్.

తెలుగు రాష్ట్రాల్లోనూ అమరన్‌కు కలెక్షన్ల పంట పండింది. 16 రోజుల్లో ఈ సినిమా రూ.35.70 కోట్ల గ్రాస్‌ను.. రూ. 20.42 కోట్ల షేర్‌ను రాబట్టింది. నైజాంలో రూ 9.47 కోట్లు, సీడెడ్‌లో రూ.2.70 కోట్లు, ఆంధ్రలో రూ. 8.25 కోట్లు చొప్పున కలెక్షన్లు సాధించి దాదాపు రూ.15 కోట్ల ప్రాఫిట్‌ను బయ్యర్లకు అందజేసింది.
అమరన్ మంచి ఊపులో ఉన్న దశలో నవంబర్ 14న కంగువా, మట్కా సినిమాలు రిలీజ్ కావడంతో కలెక్షన్లు ఎలా ఉంటాయోనని సినీ వర్గాల్లో చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో 17వ రోజు శివ కార్తీకేయన్ - సాయి పల్లవిల చిత్రం ఎన్ని వసూళ్లు సాధించిందో చూస్తే . కొత్త చిత్రాలు థియేటర్‌లలో దిగినా అమరన్ కొన్ని ఏరియాలలో మూడో వారం కూడా ఎక్స్‌లెంట్ హోల్డ్ సాధిస్తోంది. 17వ రోజు తమిళనాడులో ఏకంగా రూ. 6 కోట్లు, కర్ణాటకలో రూ . 3 లక్షలు, హిందీలో రూ. 7 లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.10 కోట్లు , మలయాళంలో రూ. 2 లక్షలు , ఓవర్సీస్‌లో రూ. 60 లక్షల చొప్పున మొత్తంగా రూ. 9 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. ఆదివారం కూడా అమరన్ గట్టిగానే కలెక్షన్లను సాధిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











