Amaran Day 18 Collections: బాక్సాఫీస్ వద్ద సాయిపల్లవి మ్యాజిక్ ..అమరన్‌కు ఎన్ని కోట్లంటే?
స్వర్గీయ మేజర్ ముకుంద్ వరద రాజన్ జీవిత కథ ఆధారంగా కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తీకేయన్, లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి జంటగా నటించిన మూవీ అమరన్. రిలీజైన నాటి నుంచి నేటి వరకు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. అంచాలను మించిన కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా .. రూ.300 కోట్ల టార్గెట్ దిశగా అడుగులు వేస్తోంది. మరి అమరన్ ఈ లక్ష్యాన్ని ఛేదించిందా లేదా? 18వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల వసూళ్లను రాబట్టిందో చూస్తే :
తమిళ దిగ్గజ నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్‌తో పాటు సోని పిక్చర్స్‌తో కలిసి సంయుక్తంగా అమరన్ నిర్మించారు. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. నటీనటులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులతో కలిపి అమరన్ సినిమాను దాదాపు రూ. 130 కోట్లతో నిర్మించారు.

టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్‌కు తోడు సాయి పల్లవి, శివ కార్తీకేయన్ జోడి వెండితెరపై ఎలా ఉందోనన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.65 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తమిళనాడు హక్కులు 40 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్, నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల రూపాయల చొప్పున అమ్ముడుపోయాయి. దీంతో అమరన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 67 కోట్లుగా విలువ కట్టారు ట్రేడ్ పండితులు.
అమరన్ మూవీ 17 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.282.05 కోట్ల గ్రాస్ .. రూ.138.45 కోట్ల షేర్ సాధించింది. తమిళనాడులో రూ. 134.55 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 37.30 కోట్లు, కర్ణాటకలో రూ. 19.55 కోట్లు, కేరళలో రూ. 10.55 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 76.50 కోట్ల చొప్పున వసూళ్లను రాబట్టాడు అమరన్. తద్వారా బ్రేక్ ఈవెన్ టార్గెట్ పోను అన్ని ఏరియాలలో రూ.71.45 కోట్ల లాభాలను అందించాడు. తమిళనాడు తర్వాత తెలుగులో అమరన్ మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. 17 రోజుల వరకు ఈ సినిమా రూ. 37.30 కోట్ల గ్రాస్.. రూ. 21.30 కోట్ల షేర్ సాధించింది. తద్వారా రూ.15.80 కోట్ల లాభాలను బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు అందించాడు.

ఇక 18వ రోజు అమరన్ వసూళ్ల విషయానికి వస్తే.. కంగువా, మట్కా సహా పలు సినిమాల నుంచి గట్టి పోటీ వస్తున్నా ఈ మూవీ బాగానే హోల్డ్ చేస్తోంది. తమిళనాడులో రూ. 6 కోట్లు, కర్ణాటకలో రూ. 4 లక్షలు, హిందీలో రూ. 2 లక్షలు, తెలుగులో రూ. 2.36 కోట్లు, మలయాళంలో రూ. 2 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 60 లక్షల చొప్పున మొత్తంగా రూ. 9 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ప్రభంజనం సృష్టించాడు శివ కార్తీకేయన్. సోమవారం నుంచి వర్కింగ్ డేస్ మొదలుకానుండటంతో అమరన్ ఎలాంటి రిజల్ట్ రాబడుతుందోనని ఉత్కంఠ నెలకొంది.


Click it and Unblock the Notifications











