Amaran Day 19 Collections : దారుణంగా పడిపోయిన కలెక్షన్స్.. సాయిపల్లవి మూవీకి ఎన్ని కోట్లంటే?

నిజ జీవిత గాథలకు , బయోపిక్‌లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో సినీ దర్శక నిర్మాతలు సైతం ఆ తరహా కథల వైపే మొగ్గుచూపుతున్నారు. దీనిలో భాగంగా స్వర్గీయ మేజర్ ముకుంద్ వరద రాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమే అమరన్. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తీకేయన్, లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. రిలీజైన నాటి నుంచి నేటి వరకు అంచనాలకు మించి కలెక్షన్స్ ‌రాబడుతోంది అమరన్. మరి 19వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల వసూళ్లను రాబట్టిందో చూస్తే :

తమిళ దిగ్గజ నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్‌తో పాటు సోని పిక్చర్స్‌తో కలిసి సంయుక్తంగా అమరన్ నిర్మించారు. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. నటీనటులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులతో కలిపి అమరన్ సినిమాను దాదాపు రూ. 130 కోట్లతో నిర్మించారు.

Amaran Day 19 Collections world wide here s the details

టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్‌‌, పోస్టర్లతో భారీ హైప్ తెచ్చుకున్న అమరన్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.65 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తమిళనాడు హక్కులు 40 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్, నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల రూపాయల చొప్పున అమ్ముడుపోయాయి. దీంతో అమరన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 67 కోట్లుగా విలువ కట్టారు ట్రేడ్ పండితులు.

అమరన్ 18 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 292.55 కోట్ల గ్రాస్.. రూ.143.45 కోట్ల షేర్ సాధించింది. తమిళనాడులో రూ. 140.25 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 39.35 కోట్లు, కర్ణాటకలో రూ. 20.85 కోట్లు, కేరళలో రూ. 11.20 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.76.90 కోట్లను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ పోను మొత్తంగా 18 రోజుల్లో రూ. 76.45 కోట్ల ప్రాఫిట్‌ను బయ్యర్లకు , డిస్ట్రిబ్యూటర్లకు అందించాడు అమరన్.

Amaran Day 19 Collections world wide here s the details

ఇక తమిళనాడు తర్వాత అమరన్‌కు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. 18 రోజుల్లో రూ.39.35 కోట్ల గ్రాస్.. రూ. 22. 35 కోట్ల షేర్ రాబట్టింది. నైజాంలో రూ. 10.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.80 కోట్లు, ఆంధ్రలో రూ. 9.20 కోట్ల చొప్పున వసూళ్లను సాధించింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16.85 కోట్ల లాభాలను అందించాడు అమరన్.

ఇక 19వ రోజు అమరన్ వరల్డ్ వైడ్ వసూళ్ల విషయానికి వస్తే.. మంగళవారం శివకార్తీకేయన్ - సాయి పల్లవిల మూవీకి బుకింగ్స్ బాగా డల్ అయ్యాయి. దాదాపు 70 శాతం మేర టికెట్ సేల్స్ పడిపోయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. తమిళనాడులో రూ.1.60 కోట్లు, కన్నడంలో రూ. 3 లక్షలు, హిందీలో రూ. 6 లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 87 లక్షలు, మలయాళంలో రూ. 2 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 27 లక్షల చొప్పున మొత్తంగా రూ. 3.5 కోట్ల వసూళ్లను సాధించింది. మరి ఈ మూడో వారం ముగిసే నాటికి అమరన్ ఎన్ని కోట్ల వసూళ్లు సాధిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X