Amaran Day 20 Collections : శివకార్తీకేయన్ 300 కోట్ల సంచలనం.. రజనీని కొట్టేసిన అమరన్

స్వర్గీయ మేజర్ ముకుంద్ వరద రాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమే అమరన్. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తీకేయన్, లేడీ పవర్‌స్టార్ సాయి పల్లవి ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. రిలీజైన నాటి నుంచి నేటి వరకు అంచనాలకు మించి కలెక్షన్స్ ‌రాబడుతున్న ఈ చిత్రం రూ.300 కోట్ల దిశగా దూసుకెళ్తున్నాడు. మరి 20వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల వసూళ్లను రాబట్టిందో చూస్తే :

కోలీవుడ్ దిగ్గజ నటుడు కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్‌తో పాటు సోని పిక్చర్స్‌తో కలిసి సంయుక్తంగా అమరన్ నిర్మించారు. ఈ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. నటీనటులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులతో కలిపి అమరన్ సినిమాను దాదాపు రూ. 130 కోట్లతో నిర్మించారు.

Amaran Day 20 Collections world wide here s the details

టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ ఈవెంట్స్‌‌, పోస్టర్లు సహా ఇప్పటి వరకు లవర్‌ బాయ్‌గా , సరదా రోల్స్‌లో కనిపించిన శివ కార్తీకేయన్ తొలిసారిగా ఆర్మీ మేజర్ వంటి సీరియస్ రోల్‌లో కనిపించడంతో అమరన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అతనికి జంటగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నటించంతో అమరన్‌కు ఎక్కడా బజ్ వచ్చింది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.65 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తమిళనాడు హక్కులు 40 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్, నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల రూపాయల చొప్పున అమ్ముడుపోయాయి. దీంతో అమరన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 67 కోట్లుగా విలువ కట్టారు ట్రేడ్ పండితులు.

విడుదలై దాదాపు 20 రోజులు కావొస్తున్నా.. కంగువా, మట్కా వంటి భారీ చిత్రాలు పోటీకి వచ్చినా బాక్సాఫీస్ వద్ద అమరన్ ఏమాత్రం తగ్గడం లేదు. 19 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 296.10 కోట్ల గ్రాస్.. రూ. 145.10 కోట్ల షేర్ సాధించి సంచలనం సృష్టించింది. తమిళనాడులో రూ. 142.20 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 40.10 కోట్లు, కర్ణాటకలో రూ. 21.20 కోట్లు, కేరళలో రూ. 11.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.. 4.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 77 కోట్లను అమరన్ అందుకున్నాడు.

Amaran Day 20 Collections world wide here s the details

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. 20 రోజుల్లో రూ.23 కోట్ల వరకు షేర్‌ను అందుకున్న అమరన్..ఈ ఏరియాలో హయ్యెస్ట్ కలెక్షన్స్‌ని అందుకున్న డబ్బింగ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఈ లిస్ట్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి (22.6 కోట్లు)ని దాటేసింది. ఈ జాబితాలో రిషబ్ శెట్టి నటించిన కాంతారా (రూ.84.25 కోట్లు) టాప్‌లో ఉంది.

ఇక 20వ రోజు అమరన్ వరల్డ్ వైడ్ వసూళ్ల విషయానికి వస్తే.. తమిళనాడులో రూ. 1.47 కోట్లు, కన్నడంలో రూ. 4 లక్షలు, హిందీలో రూ. 5 లక్షలు, తెలుగులో రూ. 86 లక్షలు, మలయాళంలో రూ. 3 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 27 లక్షల చొప్పున రూ.4 కోట్ల కలెక్షన్స్ సాధించి రూ.300 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. కంగువా, మట్కాల ఎఫెక్ట్ పెద్దగా లేకపోవడంతో ఈ సినిమా నాలుగో వారంలోనూ దుమ్మురేపు అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X