Amaran 9 Days Collections: అమరన్‌ మాస్ కుమ్ముడు ..సాయి పల్లవి మూవీకి ఎన్ని కోట్లంటే?

స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ అమరన్. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రంలో శివ కార్తీకేయన్, సాయిపల్లవి తదితరులు నటించారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్, సోని పిక్చర్స్ సంయుక్తంగా రూపొందించిన అమరన్ చిత్రానికి రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో దీపావళి కానుకగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ మూవీ వసూళ్ల వివరాల్లోకి వెళితే..

నటీనటులు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రచార ఖర్చులతో కలిపి అమరన్ సినిమాను దాదాపు రూ. 65 కోట్ల నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు రూ. 65 కోట్లకు పైగా అమ్ముడయ్యాయి. తమిళనాడు హక్కులు 40 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్, నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. మొత్తంగా రూ. 65 కోట్ల బిజినెస్ కారణంగా అమరన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 67 కోట్లుగా విలువ కట్టారు.

Amaran Day 9 Collections world wide here s the details

తమిళనాడులో అమరన్ చిత్రం ప్రభంజనం సృష్టిస్తున్నది. రెండో వారంలో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలిచింది. ఇప్పటికే సెకండ్ వీకెండ్‌కు భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. అమరన్ జోరు ఇలాగే కొనసాగితే.. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన వెట్టయాన్, అజిత్ నటించిన వాలిమై సినిమా కలెక్షన్ల రికార్డులను అధిగమించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అమరన్ సినిమా గత వారం రోజులుగా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. 8 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 180 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో రూ. 50 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసిన అమరన్ సరికొత్త బెంచ్ మార్క్‌లు క్రియేట్ చేస్తోంది.

Amaran Day 9 Collections world wide here s the details

ఇక 9వ రోజు అమరన్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రూ. 8 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఉదయం, మధ్యాహ్నం డల్‌గా ఉన్న బుకింగ్స్.. ఫస్ట్ షో నాటికి దాదాపు 40.68 శాతం మేర ఆక్యూపెన్సీ నమోదు చేసినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. తమిళ్‌తో సమానంగా తెలుగులోనూ బుకింగ్స్ బాగున్నట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 9వ రోజు రూ. 1.16 కోట్ల రేంజ్‌లో గ్రాస్ వసూళ్లను రాబట్టాడు అమరన్.

తమిళంలో ఇప్పటికే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన అమరన్.. తెలుగులో రూ. 50 కోట్ల టార్గెట్ ఫినిష్ చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ వారం కొత్త సినిమాలు పెద్దగా లేకపోవడంతో ఈ వారాంతంలోనూ అమరన్ దుమ్ము రేపే అవకాశం ఉంది. నెక్ట్స్ వీక్ సూర్య కంగువా, వరుణ్ తేజ్ మట్కాలు రిలీజ్ కానుండటంతో ఆ లోపు వీలైనంతగా కలెక్షన్స్ రాబట్టాలని అమరన్ భావిస్తున్నాడు.

More from Filmibeat

Read more about: sivakarthikeyan sai pallavi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X