Amaran Day 1 Collections: అమరన్ మూవీకి రికార్డు ఓపెనింగ్స్.. సాయిపల్లవి మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా అమరన్. ముకుంద్ పాత్రలో శివకార్తీకేయన్, ఆయన భార్య ఇందు రెబాకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటించారు. లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ నిర్మాతగా మారి రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై సోని ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌తో కలిసి నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియాసామి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? సాధించిన కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
ప్రముఖ రచయితలు శివ్ అరూర్, రాహుల్ సింగ్ సంయుక్తంగా రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ అనే పుస్తకం ఆధారంగా చేసుకొని అమరన్ మూవీని తెరకెక్కించారు. జమ్ము, కశ్మీర్‌లో మిలిటెంట్లను అత్యంత ధైర్య సాహసంతో ఎదుర్కొని యుద్ధభూమిలో అమరుడైన ఈ యోధుడి కథను సుమారుగా 200 కోట్ల రూపాయలతో నిర్మించారు.
Recommended Video


అమరన్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ వల్ల హైప్ క్రియేట్ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. దాంతో విడుదలకు ముందు బిజినెస్ భారీగా జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను 65 కోట్లకుపైగా జరిగింది. తమిళనాడు హక్కులు 40 కోట్ల రూపాయల షేర్, తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్, నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.
మేజర్ ముకుంద్ బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమా 65 కోట్ల షేర్, 130 కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. ఈ చిత్రాన్ని ఇండియాతోపాటు ఓవర్సీస్‌లో రికార్డు స్క్రీన్లలో రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమా తొలి రోజు ఓపెనింగ్స్ భారీగా సాధించింది. సాయిపల్లవి మూవీకి అనూహ్యమైన స్పందన బాక్సాఫీస్ వద్ద లభిస్తున్నది.

అమరన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన లభించింది. ఈ సినిమా ప్రీ సేల్స్ విషయానికి వస్తే.. తమిళనాడులో 10 కోట్ల రూపాయలు, తెలుగులో 3 కోట్ల రూపాయలు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 10 కోట్లు, ఓవర్సీస్‌లో ఈ మూవీ 4 కోట్ల రూపాయలతో కలిపి మొత్తంగా 27 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.
ఈ మూవీ తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. తమిళనాడులో 13 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయలు, ఇతర భాషల్లో కలిపి 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌తో కలిపి ఈ సినిమా తొలి రోజు 35 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ప్రేక్షకుల రెస్పాన్స్ పెరిగితే ఇంకా భారీగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











