Amaran Day 2 Collections: 50 కోట్లు కొల్లగొట్టిన సాయిపల్లవి.. అమరన్‌కు ఎన్ని కోట్లంటే?
మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన అమరన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. తమిళ స్టార్ హీరో శివ కార్తీకేయన్, టాప్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన ఎమోషనల్ ట్రాజెడీ మూవీ అక్టోబర్ 31న రిలీజై అన్ని వర్గాలను ఆకట్టుకొంటున్నది. యువ దర్శకుడు రాజ్ కుమార్ పెరియార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్లు వివరాల్లోకి వెళితే..
ఇండియన్ సినిమా రంగంలో లెజెండరీ యాక్టర్, డైరెక్టర్, నిర్మాత కమల్ హాసన్ భారీ బడ్జెట్‌తో అమరన్ చిత్రాన్ని నిర్మించారు. టాప్ యాక్టర్లు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా బజ్ భారీగా క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా టాప్ రేంజ్‌లో జరిగింది.

అమరన్ సినిమాలో సాయి పల్లవి, శివ కార్తీకేయన్ లాంటి వాళ్లు నటించడంతో భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను 65 కోట్లకుపైగా జరిగింది. తమిళనాడు హక్కులు 40 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్, నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఈ సినిమా భారీగానే వసూళ్లను రాబట్టింది. నైజాంలో 1.30 కోట్లు, ఆంధ్రాలో 1 కోటి రూపాయలు, సీడెడ్‌లో 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 2.8 కోట్ల రూపాయల నెట్, 5 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తొలి రోజే ఈ సినిమా 35 శాతం రికవరీ సాధించింది.

అమరన్ మూవీ ఇతర ప్రాంతాల వసూళ్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 17.5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 2 కోట్ల రూపాయలు, కేరళలో 1.25 కోట్లు, ఇతర ప్రాంతాల్లో 75 లక్షలు వసూలు చేసింది. కన్నడ, తమిళం, మలయాళంతోపాటు ఇతర ప్రాంతాల్లో ఈ సినిమా 22 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో 10 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల కలెక్షన్లతో కలిపి ఈ సినిమా 37 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
శివ కార్తీకేయన్ మూవీ రెండో రోజు కూడా భారీగా వసూళ్లను రాబడుతున్నది. అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా అక్యుపెన్సీ కూడా నిలకడగా ఉంది. దాంతో ఈ సినిమా రెండో రోజు తమిళనాడులో 7 కోట్ల రూపాయలు, అలాగే మిగితా భాషల్లో 3 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఓవర్సీస్ కలెక్షన్లతో కలిపి ఈ సినిమా రెండో రోజు 12 నుంచి 15 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా రెండో రోజు 50 కోట్ల మైలురాయిని దాటేస్తుందని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











