Amaran Day 3 Collections: సాయిపల్లవి బాక్సాఫీస్ సునామీ.. 100 కోట్ల క్లబ్‌లో అమరన్!

స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన అమరన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. తమిళ స్టార్ హీరో శివ కార్తీకేయన్, టాప్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన ఎమోషనల్ ట్రాజెడీ మూవీ అక్టోబర్ 31న రిలీజై అన్ని వర్గాలను ఆకట్టుకొంటున్నది. యువ దర్శకుడు రాజ్ కుమార్ పెరియార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్లు వివరాల్లోకి వెళితే..

ఇండియన్ సినిమా రంగంలో లెజెండరీ యాక్టర్, డైరెక్టర్, నిర్మాత కమల్ హాసన్ భారీ బడ్జెట్‌తో అమరన్ చిత్రాన్ని నిర్మించారు. టాప్ యాక్టర్లు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను 65 కోట్లకుపైగా జరిగింది. తమిళనాడు హక్కులు 40 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్, నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి.

Amaran Movie Day 3 Expected Box Office Collections Worldwide
అమరన్ చిత్రం తొలి రోజు భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమా తమిళనాడులో 16 కోట్ల రూపాయలు, ఆంధ్రా, తెలంగాణలో 4.5 కోట్లు, కర్ణాటకలో 2 కోట్ల రూపాయలు, కేరళలో 1.5 కోట్ల రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో 50 లక్షలు, ఓవర్సీస్‌లో 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తొలి రోజు 36 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

సాయిపల్లవి నటించిన అమరన్ చిత్రం రెండో రోజు తమిళనాడులో 16 కోట్ల రూపాయలు, ఏపీ, నైజాంలో 3.5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.5 కోట్ల రూపాయలు, కేరళలో 1 కోటి రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 20 లక్షలు వసూలు చేసింది. ఈ సినిమా రెండు రోజుల్లో 22 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.

Amaran Movie Day 3 Expected Box Office Collections Worldwide

అమరన్ చిత్రం మూడో రోజు కూడా భారీ ఆక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది. ఈ సినిమా చెన్నైలో 90 శాతం, మధురైలో 98 శాతం, కోయబత్తూరులో 97 శాతం, పాండిచ్చేరిలో 98 శాతం, సలెంలో 97 శాతం, తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో 90 శాతం కంటే ఎక్కువగానే ఆక్యుపెన్సీ నమోదైంది. ఢిల్లీ, ముంబైలో 85 శాతం నమోదైంది.

శివ కార్తీకేయన్ నటించిన ఈ సినిమా మూడో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపించింది. ఈ సినిమా మూడో రోజు ఇండియావైడ్ 17 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది. ధాంతో ఇండియాలో ఈ సినిమా మొత్తంగా 75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది.

More from Filmibeat

Read more about: amaran sai pallavi diwali 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X