Amaran Day 6 Collections: బాక్సాఫీస్ క్వీన్ సాయిపల్లవి 200 కోట్ల సంచలనం.. అమరన్ ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
ప్రముఖ నటుడు కమల్ హాసన్ ప్రొడ్యూసర్‌గా మారి రూపొందించిన చిత్రం అమరన్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో టైటిల్ పాత్రను శివ కార్తీకేయన్, అతడి భార్య పాత్రను సాయిపల్లవి పోషించారు. రాజ్ కుమార్ పెరియార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీన దీపావళీ కానుకగా రిలీజైంది. ఈ సినిమా రోజు వారీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
అమరన్ సినిమాను సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మాతగా మారిన ప్రముఖ నటుడు దర్శకుడు కమల్ హాసన్ నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను 65 కోట్లకుపైగా జరిగింది. తమిళనాడు హక్కులు 40 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్, నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఈ చిత్రాన్ని 6 వేల స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

సాయిపల్లవి నటించిన అమరన్ సినిమా తొలి రోజు 3 కోట్ల రూపాయలు, రెండో రోజు 2.5 కోట్ల రూపాయలు, మూడో రోజు 2 కోట్ల రూపాయలు, 4వ రోజు 2.2 కోట్ల రూపాయలు, 5వ రోజు 1.36 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. ఏపీ, తెలంగాణలో అమరన్ చిత్రం 11 కోట్లు నికరంగా, 17 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో అమరన్ సినిమా భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా నైజాంలో 5 కోట్ల రూపాయలు నికరంగా, సీడెడ్‌లో 1.5 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో 4.1 కోట్ల రూపాయలు నికరంగా వసూళ్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా 11 కోట్ల రూపాయలు రాబట్టింది.
అమరన్ మూవీ గత నాలుగు రోజుల్లో ఇండియాలో వివిధ భాషల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో ఈ సినిమా 75 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక ఆంధ్రా, నైజాంలో 20 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 9 కోట్ల రూపాయలు, కేరళలో 5 కోట్ల రూపాయలు, మిగితా ప్రాంతాల్లో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 107 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రోజు 35 కోట్ల రూపాయలు, రెండో రోజు 31 కోట్ల రూపాయలు, మూడో రోజు 37 కోట్ల రూపాయలు, నాలుగు రోజు 33 కోట్ల రూపాయలు, ఐదో రోజు 18 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో 5 రోజుల్లో 154 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.
ఇక ఆరో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం సుమారుగా ఇండియాలో 10 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 13 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని పేర్కొన్నారు. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 174 కోట్ల రూపాయలు నికరంగా వసూలు చేసింది. ఇక ఈ ఏపీలో 5 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్‌తో జర్నీ ప్రారంభించిన ఈ సినిమా 3 రోజుల్లోనే లాభాల జోన్‌లోకి ప్రవేశించింది.


Click it and Unblock the Notifications











