Amaran Day 7 Collections: అమరన్ బాక్సాఫీస్ ఊచకోత.. సాయిపల్లవి సినిమాకు ఎన్ని కోట్లంటే?
తమిళ స్టార్ హీరో, హీరోయిన్లు సాయిపల్లవి, శివ కార్తీకేయన్ నటించిన అమరన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ నిర్మాతగా మారి రూపొందించిన ఈ సినిమాను రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్, సోని పిక్చర్స్ సంయుక్తంగా రూపొందిన ఈ సినిమాను రాజ్ కుమార్ పెరియార్ రూపొందించారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథగా రూపొందిన ఈ సినిమా ఏ మేరకు కలెక్షన్లు సాధించిందనే వివరాల్లోకి వెళితే..
లవ్, ఎమోషనల్ అంశాలతో రూపొందించిన ఈ సినిమాలో టాప్ యాక్టర్లు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను 65 కోట్లకుపైగా జరిగింది. తమిళనాడు హక్కులు 40 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్, నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. 65 కోట్ల రూపాయల బిజినెస్ కారణంగా ఈ మూవీ 67 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ జర్నీని ప్రారంభించింది.

ఇండియాలో ఈ సినిమా తొలి రోజు నుంచే భారీగా వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ సినిమా తొలి రోజు 22 కోట్ల రూపాయలు, రెండో రోజు 20 కోట్ల రూపాయలు, మూడో రోజు 21 కోట్లు, 4వ రోజు 22 కోట్ల రూపాయలు, 5వ 10వ కోట్ల రూపాయలు, 6వ రోజు 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 102 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఓవర్సీస్‌లో అమరన్ సినిమాకు భారీ వసూళ్లు రాబడుతున్నది. నార్ అమెరికాలో 37 కోట్ల రూపాయలు వసూలు చేసింది.దాంతో ఈ సినిమా 6.5 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 54 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా నార్త్ అమెరికాతోపాటు పలు దేశాల్లో కలెక్షన్లు స్ట్రాంగ్‌గా రాబడుతున్నది.
ఇక 7వ రోజు అమరన్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ఇండియాలో 8 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. దాంతో ఈ సినిమా 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లకు చేరువ కానున్నది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 35 కోట్ల రూపాయలు, రెండో రోజు 31 కోట్ల రూపాయలు, 3వ రోజు 37 కోట్ల రూపాయలు, 4వ రోజు 33 కోట్ల రూపాయలు, 5వ రోజు 19 కోట్లు రూపాయలు, 6వ రోజు 13 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక 7వ రోజు 10 కోట్ల రూపాయలతో కలిపి ఈ సినిమా 180 కోట్ల రూపాయలు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











