Amaran 8 Days Collections: రజనీ, అజిత్ రికార్డులు బ్రేక్ చేసిన సాయిపల్లవి.. అమరన్‌కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ అమరన్. లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ నిర్మించిన ఈ చిత్రంలో శివ కార్తీకేయన్, సాయిపల్లవి తదితరులు నటించారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్, సోని పిక్చర్స్ సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియార్ దర్శకత్వం వహించారు. తమిళం, తెలుగు, మలయాళం,కన్నడ భాషల్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
మేజర్ ముకుంద్ భార్య జీవితంలో చోటుచేసుకొన్న లవ్, ఎమోషనల్ అంశాలతో రూపొందించిన ఈ సినిమాలో టాప్ యాక్టర్లు, టెక్నిషియన్స్ రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 65 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను 65 కోట్లకుపైగా జరిగింది. తమిళనాడు హక్కులు 40 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల హక్కులు 7 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్, నార్త్ ఇండియా హక్కులు 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. 65 కోట్ల రూపాయల బిజినెస్ కారణంగా ఈ మూవీ 67 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ జర్నీని ప్రారంభించింది.

తమిళనాడులో అమరన్ చిత్రం ప్రభంజనం సృష్టిస్తున్నది. రెండో వారంలో కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలిచింది. ఇప్పటికే రెండో వారాంతానికి భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ఇదే జోరు కొనసాగితే.. రజనీకాంత్ నటించిన వెట్టయాన్, అజిత్ నటించిన వాలిమై సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్ల రికార్డును అధిగమించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అమరన్ సినిమా గత 4 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను నమోదు చేసింది. తమిళంలో 85 కోట్ల రూపాయలు నికరంగా, తెలుగులో 22 కోట్లు, కన్నడలో 10 కోట్లు, మలయాళంలో 6 కోట్లు, హిందీ ఇతర ప్రాంతాల్లో కలెక్షన్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 125 కోట్లు వసూలు చేసింది.

ఇక తెలుగులో సాయిపల్లవి నటించిన సినిమాకు బ్రహ్మండమైన కలెక్షన్లు రాబట్టింది. నైజాంలో 6 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 2 కోట్లు, ఆంధ్రాలో 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 22 కోట్ల గ్రాస్, 13 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా బిజినెస్ 5.5 కోట్లుగా అయింది. ఇప్పటికే ఈ సినిమాకు 8 కోట్ల వరకు లాభాలు వచ్చాయి. ఇటీవల కాలంలో ఇంతగా ప్రాఫిట్స్ వచ్చిన సినిమా ఏదీ లేదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఇక అమరన్ చిత్రం 8వ రోజున తక్కువ వసూళ్లు సాధించినప్పటికీ.. వర్కింగ్ డే రోజున నిలకడగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 6 కోట్ల రూపాయలు, వరల్డ్ వైడ్ 8 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 185 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 50 కోట్ల మార్కును దాటిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











