For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prabhas: సలార్ సినిమాకు అమెజాన్ దిమ్మతిరిగే ఆఫర్.. ఏ రేంజ్‌లో బిజినెస్ అంటే!

    |

    టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పాన్ ఇండియా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి. ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. దీంతో నిర్మాతలు బిజినెస్ డీలింగ్స్ పై చర్చలు జరిపడానికి సిద్ధమయ్యారు. అమెజాన్ ప్రైమ్ ఇటీవల చెప్పిన రేటు అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందట. ఆ వివరాల్లోకి వెళితే..

    అభిమానుల్లో అసహనం

    అభిమానుల్లో అసహనం

    రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదు గాని ఆ సినిమా కంటే ఎక్కువగా సలార్ పైనే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. రాధేశ్యామ్ పై ఎదో ఒక విధంగా బజ్ క్రియేట్ చేస్తే గాని మళ్ళీ పాన్ ఇండియా కలర్ రాదు. యూవీ క్రియేషన్స్ డైరెక్టర్ రాధాకృష్ణ పనితీరుపై ఇప్పటికే అభిమానుల్లో అసహనం డోస్ పెరిగింది.

    టైమ్ వెస్ట్ చేయకుండా

    టైమ్ వెస్ట్ చేయకుండా

    ఇక సలార్ సినిమా షూటింగ్ ను మొదలు పెడితే టైమ్ వెస్ట్ చేయకుండా ఫినిష్ చేసేస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ సెట్ చేసుకున్న ప్లానింగ్ ప్రభాస్ కు కూడా బాగా నచ్చేసిందట. అందుకే ఆ సినిమా కోసం టైమ్ చూసుకోకుండా కష్టపడ్డాడు. ఇక మొత్తానికి ఆ సినిమా షూటింగ్ జూలై లోనే ఫినిష్ చేయాలని మరో పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేసుకున్నారు.

    టీజర్ రిలీజ్ చేసిన అనంతరం

    టీజర్ రిలీజ్ చేసిన అనంతరం

    ఇక సినిమా షూటింగ్ అయిపోకముందే బిజినెస్ డీల్స్ పై చర్చలు మొదలయ్యాయి. అసలైతే నిర్మాతలు టీజర్ రిలీజ్ చేసిన అనంతరం భారీ హైప్ తో డీల్స్ గురించి మాట్లాడాలని అనుకున్నారు. కానీ అంతకంటే ముందే ఊహించని విధంగా ఆఫర్స్ వస్తున్నాయట. కానీ నిర్మాతలు ఇప్పుడే తోందర పడాలని అనుకోవడం లేదు.

    130కోట్లకు పైగా ఆఫర్

    130కోట్లకు పైగా ఆఫర్

    ఇక అమెజాన్ ప్రైమ్ సంస్థ ఎలాగైనా సలార్ డిజిటల్ రైట్స్ అందుకోవాలని నిర్మాతలను గట్టిగానే టెంప్ట్ చేస్తోంది. అసలైతే 100కోట్లు అంటేనే ఆశ్చర్య అనుకుంటున్న తరుణంలో అమెజాన్ అంతకు మించి అనేలా 130కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రేటు చెప్పడంతో పోటీలో ఉన్న హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ కూడా చేతులెత్తేశాయాని తెలుస్తోంది.

    Most Awaited Movies Love Story , Kgf chapter 2 Updates || Filmibeat Telugu
    బడ్జెట్ వెనక్కి వచ్చినట్లే..

    బడ్జెట్ వెనక్కి వచ్చినట్లే..

    సలార్ సినిమాకు మొత్తం బడ్జెట్ 150కోట్ల వరకు అవుతోందట. ఇక సినిమా ప్రీ రిలీజ్ ను బట్టి రెమ్యునరేషన్ డీలింగ్స్ మరోసారి మాట్లాడుకునే అవకాశం ఉందట. ఒకవేళ అమెజాన్ ఆఫర్ కు ఒప్పుకుంటే బడ్జెట్ దాదాపు వెనక్కి వచ్చినట్లే. శాటిలైట్ రైట్స్ కూడా ఇంకా అమ్ముడు పోవాల్సి ఉంది. అంటే దాదాపు నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే నిర్మాతలు సేఫ్ అవుతున్నారని చెప్పవచ్చు. ఇక రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ వద్ద లాభం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

    English summary
    AmazonPrime offering an Earth-staggering Deal for Prabhas's Salaar digital rights. It is said to be 130 crores+. Makers yet to take final decision.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X