ఓటీటీలో విజయ్ ‘మాస్టర్’... అమెజాన్ ప్రైమ్ వీడియో చెల్లించిన మొత్తం తెలిస్తే షాకే?
లాక్‌డౌన్ కారణంగా సినిమా హాళ్లు మూసివేతకు గురికావడంతో దేశవ్యాప్తంగా సినీ రంగం కుదేల్ అయిపోయింది. అయితే థియేటర్లు మూత పడటంతో పలు సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. పలు భారీ చిత్రాల నిర్మాతలు మాత్రం థియేటర్లు ఓపెన్ అయ్యేంత వరకు వేచి చూశారు. అలాంటి కోవలో తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన మాస్టర్ చిత్రం నిలిచింది. అయితే మాస్టర్ ఓటీటీలో రిలీజ్ చేయడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో ఎంత చెల్లించిందంటే...

విజయ్ స్టామినాకు అద్దం
లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాత థియేటర్ల ఓపెన్‌కు అనుమతి ఇవ్వడంతో మాస్టర్ జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దళపతి విజయ్ క్రేజ్‌తో భారీగా వసూళ్లను రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద విజయ్ స్టామినాకు ఈ సినిమా కలెక్షన్లు అద్దం పట్టాయి.

రెండు వారాల్లో 200 కోట్లు
విజయ్ నటించిన మాస్టర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను రాబట్టడంతో ట్రేడ్ వర్గాలు సంతోషంలో మునిగిపోయాయి. విజయ్ చిత్రం రెండు వారాల్లో రూ.200 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టడం లాక్‌డౌన్ తర్వాత రికార్డుగా నమోదు అయింది. లాక్‌డౌన్ తర్వాత భారీ వసూళ్లను రాబట్టిన ఏకైక చిత్రంగా ఘనతను సాధించింది.

ఏడాదిపాటు ఎదురు చూపులు
అయితే విజయ్ చిత్రం థియేటర్లలోకి రాకముందే అమెజాన్‌తో ఒప్పందం కుదిరింది. నేరుగా అమెజాన్‌లో రిలీజ్ చేస్తే ఊహించని మొత్తాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే థియేటర్లలో రిలీజ్ చేయాలనే సంకల్పంతోనే దాదాపు ఏడాదిపాటు ఎదురు చూశారు.

రికార్డు స్థాయిలో ఓటీటీ రైట్స్ బిజినెస్
విజయ్ నటించిన మాస్టర్ చిత్రాన్ని జనవరి 29వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. అయితే మాస్టర్ చిత్రం ఓటీటీ రైట్స్ కోస్ం తొలుత అమెజాన్ 36 కోట్లకుపైగా చెల్లించినట్టు సమాచారం. అయితే సినిమా రిలీజ్ తర్వాత రెండువారాల్లోపే ఓటీటీలో రిలీజ్ చేసినందుకు నిర్మాతకు అదనంగా 15.5 కోట్లు ముట్ట జెప్పినట్టు మరో వార్త కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నది. అంటే మాస్టర్ చిత్ర నిర్మాత అమెజాన్ నుంచి మొత్తంగా రూ.51 కోట్లకుపైగా అందుకొన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











