Ambajipeta Marriage Band day 3 Collections ఊపందుకొన్న సుహాస్ మూవీ కలెక్షన్లు.. 3 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

తెలుగు సినిమా పరిశ్రమలో యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మాతగా నూతన దర్శకుడు దుశ్యంత్ కటికనేని రూపొందించిన చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.ఈ చిత్రంలో కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు పొందిన సుహస్, నూతన హీరోయిన్ శివానీ నాగారం, శరణ్య ప్రదీప్, మలయాళ నటుడు నితిన్ తదితరులు నటించారు. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాను యాక్టర్ల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా 10 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ సినిమాకు బజ్ క్రియేట్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లోను, ఓవర్సీస్‌లోను అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఏపీ, నైజాంలో 450 నుంచి 500 స్కీన్లలో, అమెరికాలో 200 లోకేషన్లలో రిలీజ్ చేశారు.

Ambajipeta Marriage Band 3 days expected Box Office Collections Worldwide

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాను పలు ప్రాంతాల్లో గీతా ఆర్ట్స్ స్వంతంగా రిలీజ్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌ను 8 కోట్ల షేర్‌గా వాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. 8.2 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాపీస్ జర్నీని మొదలుపెట్టింది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో తొలి ఆట నుంచే హిట్ టాక్‌తో మూవీ దూసుకెళ్తున్నది. ఈ చిత్రం మూడో రోజు మార్నింగ్ షోకు 25 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 35 శాతం, ఫస్ట్ షోకు 40 శాతం, సెకండ్ షోకు 40 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

Ambajipeta Marriage Band 3 days expected Box Office Collections Worldwide

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు గత మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. తొలి రోజు ఏపీ, నైజాంలో 1.3 కోట్లు, రెండో రోజు 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో రెండు రోజులకు కలిపి 75 లక్షల రూపాయలు నికరంగా వసూలు చేసింది. గత రెండు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5.16 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని నిర్మాత అధికారికంగా ప్రకటన చేశారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు 3వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే. తొలి, రెండో రోజుల కంటే మూడో రోజు ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం 1.45 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 35 లక్షలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి దాంతో ఈ సినిమా మూడో రోజుల్లో 7.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X