Ambajipeta Marriage Band 4 days Collections లాభాలకు చేరువగా సుహాస్ మూవీ.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని తన సొంత బ్యానర్ ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌పై రూపొందించిన చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు. ఈ సినిమాను అల్లు అరవింద్‌కు చెందిన జీఏ2, వెంటకేష్ మహాకు చెందిన మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ సక్సెస్ అందుకొన్న హీరో సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకొన్నాడు. నూతన హీరోయిన్ శివానీ నాగారం నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా కంటెంట్‌పై భారీ నమ్మకం ఉండటంతో ఈ మూవీని సొంతంగా రిలీజ్ చేశారు. అన్ని ప్రాంతాల్లోను ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పంపిణీ చేసింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను 8 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు. దాదాపు 450 నుంచి 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు మూవీని ఒక రోజు ముందుగానే ప్రీమియర్లు ప్రదర్శించారు. ప్రీమియర్లకు మంచి రెస్సాన్స్ రావడంతోపాటు హిట్ టాక్ కూడా రావడంతో ఈ మూవీకి సానుకూలత ఏర్పడింది. తొలి రోజు వసూళ్ల కంటే.. రెండో రోజు వసూళ్లు..2వ రోజు కలెక్షన్ల కంటే 3వ రోజు వసూళ్లు వచ్చాయి. ఇక 4వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద స్టడీగా వసూళ్లు సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల్లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 1వ రోజు 1.4 కోట్లు, రెండో రోజు 1.5 కోట్ల రూపాయలు, 3వ రోజు 1.55 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 1 కోటి రూపాయలు రాబట్టింది.దాంతో ఈ సినిమా మూడు రోజుల్లో 8.06 కోట్లు వసూలు చేసింది.

ఇక అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు 4వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వస్తే.. గత మూడు రోజులతో పోల్చుకొంటే 50 శాతం తగ్గే అవకాశం ఉంది. ఓవరాల్‌గా 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమా 4వ రోజు ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో కలిపి 75 లక్షలు నికరంగా.. ఓవర్సీస్‌లో 30 లక్షలు రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











