Ambajipeta Marriage Band 5 days Collections బాక్సాఫీస్ వద్ద సుహాస్ మూవీ పరిస్థితి ఏంటి? 5వ రోజు ఎన్ని కోట్లంటే
యువ హీరో, హీరోయిన్లు సుహాస్, శివానీ నాగారం, శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న నటించిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు చిత్రం బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. చిన్న చిత్రంగా రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నది. ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో అన్ని వర్గాలను ఆకట్టుకొంటున్నది. ఈ చిత్రం గత 5 రోజులుగా సాధించిన కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ విషయానికి వస్తే..
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు చిత్రం ఆర్టిస్టుల రెమ్యునరేషన్, ఇతర ఖర్చులతో కలిపి ఈ సినిమా 10 కోట్ల రూపాయలతో వ్యయంతో నిర్మించారు. ఈ సినిమాను సొంతంగా గీతా ఆర్ట్స్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ సినిమాను 6 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్ణయించారు. పెయిడ్ ప్రీమియర్లతో పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ జర్నీని సానుకూలంగా మారింది.

ఇక అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 1.5 కోట్ల రూపాయలు నికరంగా, రెండో రోజు 1.6 కోట్లు, మూడో రోజు 1.7 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 75 లక్షల రూపాయలు నికరంగా వసూలు చేసింది. నాలుగు రోజుల్లో 9 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు మూవీ వర్కింగ్ డే రోజు అంటే 5వ రోజు తక్కువగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాకు ఓవరాల్‌గా 30 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది. అయితే ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి టీమ్ ఆంధ్రాలో పర్యటిస్తున్నది. దాంతో కలెక్షన్లు పెరుగుతాయా? అనేది వేచి చూడాల్సిందే.

ఇదిలా ఉండగా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చిత్రం 5వ రోజు నిలకడగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా 70 లక్షలు రూపాయలు నికరంగా 1.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 9.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఈ వారం భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్నందున ఈ పోటీని తట్టుకొని మూవీ కలెక్షన్లు సాధిస్తుందా? అనే వేచి చూడాల్సిందే.
ఇక అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు చిత్రం చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఓవరాల్‌గా 6 కోట్ల నికరంగా, 9.5 కోట్లు వసూలు చేసింది. దాదాపు ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరువగా ఉంది.


Click it and Unblock the Notifications











