Ambajipeta Marriage Band Collections సుహాస్ కెరీర్‌లోనే హయ్యెస్ట్‌గా.. ఎన్ని కోట్లు వస్తే సినిమా హిట్ అంటే?

తెలుగు సినిమా పరిశ్రమలో యువ హీరో, కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకొన్న నటుడు సుహస్ నటించి చిత్రం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శివానీ హీరోయిన్‌గా నటించింది. ఫిబ్రవరి 2వ తేదీన రిలీజైన ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాను చిన్న తారలు, ప్రతిభావంతులైన టెక్నిషియన్స్‌తో కలిపి రూపొందించారు. ఈ సినిమా తారలు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారుగా 20 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా ట్రీజర్లు ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో భారీగా బిజినెస్ వ్యాల్యూ కట్టారు.

Ambajipeta Marriage Band expected Box Office Collections Worldwide

ఇక అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాను పలు చోట్ల గీతా ఆర్ట్స్ బ్యానర్ సొంతంగా రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో, మరి కొన్ని ప్రాంతాల్లో థియేట్రికల్ రైట్స్ అమ్మారు. దాంతో ఈ సినిమాను ప్రీ రిలీజ్ బిజినెస్‌ను సుమారుగా 15 కోట్ల షేర్‌, 30 కోట్ల గ్రాస్ వసూళ్లుగా వ్యాల్యూ కట్టారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు పేట సినిమాకు భారీగా రెస్పాన్స్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేశారు. నైజాం, ఆంధ్రాలో కలిపి సుమారుగా 500 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు తెలిసింది. ఓవర్సీస్‌లో కూడా 200కుపైగా లోకేషన్లలో రిలీజ్ చేశారు. దాంతో తొలి రోజు భారీగా కలెక్షన్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.

Ambajipeta Marriage Band expected Box Office Collections Worldwide

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా తొలి ఆట నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకొన్నది. పెయిడ్ ప్రీమియర్ల తర్వాత క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు లభించాయి. దాంతో రెస్పక్టబుల్ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఈ సినిమా తొలి రోజు 2 కోట్ల నుంచి 2.5 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు రెండో రోజు విషయానికి వస్తే..1.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండు రోజుల్లో అమెరికాలోను, ఇతర ప్రాంతాల్లోను ఈ సినిమా 75 లక్షల రూాపాయలు రాబట్టింది. రెండు రోజుల్లో ఈ సినిమా 5.16 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను వసూలు చేసింది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు మూడో రోజు కూడా నిలకడగా వసూళ్లు సాధించింది. ఈ సినిమా 1.5 కోట్ల రూపాయలు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X