Ambajipeta Marriage Band: కుమ్మిన సుహాస్.. 4 రోజుల్లోనే అన్ని కోట్లతో రికార్డు.. లాభం ఎంతో తెలిస్తే!

తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మందే హీరోలు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే నటనతో ప్రత్యేకతను చాటుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో సుహాస్ ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి హీరోగా మారిన అతడు.. ప్రతి సినిమానూ సక్సెస్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా ఇప్పుడు 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రియలిస్టిక్ స్టోరీతో రూపొందిన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. దీంతో వసూళ్లు పోటెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ నాలుగు రోజుల వసూళ్లను మీరే చూసేయండి మరి!

అంబాజీపేట మ్యారేజీ బ్యాండు:సుహాస్ హీరోగా దుశ్యంత్ తెరకెక్కించిన చిత్రమే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్, వెంకటేష్ మహా సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు. ఇందులో శివానీ హీరోయిన్‌గా, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు.

Ambajipeta Marriage Band Movie 4 Days Worldwide Collections

అంబాజీపేట బిజినెస్ డీటేల్స్:సుహాస్ హీరోగా నటించిన ఎమోషనల్ మూవీనే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'. ఈ మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ చిత్రానికి మంచి డిమాండ్ వస్తుందని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.80 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఫలితంగా ఎంతో గ్రాండ్‌గా ఈ సినిమా రిలీజ్ అయింది.

4వ రోజు తెలుగులో ఎంతంటే:ఎమోషనల్ కంటెంట్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీకి తెలుగులో మంచి టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే స్పందన లభిస్తోంది. దీంతో మొదటి రోజు నుంచే మంచి వసూళ్లు లభిస్తున్నాయి. అయితే, వర్కింగ్ డే అయిన సోమవారం ఇది డౌన్ అయింది. ఫలితంగా 4వ రోజు ఈ సినిమా రూ. 27 లక్షలు షేర్‌ను వసూలు చేసింది.

Ambajipeta Marriage Band Movie 4 Days Worldwide Collections

4 రోజులకు కలిపి ఎంతొచ్చింది?:సుహాస్ హీరోగా దుశ్యంత్ తెరకెక్కించిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4 రోజుల్లో డీసెంట్ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాం ఏరియాలో రూ. 1.15 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ. 1.65 కోట్లు షేర్ వసూలు అయింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ. 2.85 కోట్లు షేర్, రూ. 5.50 కోట్లు వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?:'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీకి తెలుగులో 4 రోజుల్లో రూ. 2.85 కోట్లు షేర్ వసూలు అయింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌ ప్రాంతాల్లో కలుపుకుని కేవలం రూ. 85 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.70 కోట్లు షేర్‌తో పాటు రూ. 7.35 కోట్లు గ్రాస్ వసూలైంది.

Ambajipeta Marriage Band Movie 4 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.70 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.00 కోట్లుగా నమోదైంది. ఇక, 4 రోజుల్లో దీనికి రూ. 3.70 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 70 లక్షలు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X