Ambajipeta Marriage Band: 6 రోజుల్లో ఊహించని వసూళ్లు.. లాభంతో రికార్డు కొట్టిన సుహాస్
టాలెంట్ ఉంటే ఎలాంటి హీరో అయినా.. ఎప్పటికైనా సక్సెస్‌ను చూస్తాడు అని నిరూపించుకుంటూ దూసుకుపోతోన్నాడు సుహాస్. క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి హీరోగా మారిన అతడు.. వరుసగా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అలా ఇప్పుడు 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' అనే సినిమాతో వచ్చాడు. పల్లెటూరి నేపథ్యంతో రియలిస్టిక్ స్టోరీతో రూపొందిన ఈ సినిమాకు ఆరంభం నుంచీ మంచి స్పందన లభిస్తోంది. దీంతో వసూళ్లు భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఆరు రోజుల వసూళ్లను మీరే చూసేయండి మరి!
సుహాస్ నుంచి మరో క్రేజీ మూవీ:సుహాస్ హీరోగా దుశ్యంత్ రూపొందించిన చిత్రమే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్, వెంకటేష్ మహా సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు. ఇందులో శివానీ హీరోయిన్‌గా, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ కీలక పాత్రలు చేశారు.

అంబాజీపేట బిజినెస్ డీటేల్స్:టాలెంటెడ్ గాయ్ సుహాస్ హీరోగా నటించిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ చిత్రానికి మంచి డిమాండ్ వస్తుందని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.80 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఫలితంగా ఎంతో గ్రాండ్‌గా ఈ సినిమా రిలీజ్ అయింది.
6వ రోజు తెలుగులో ఎంతంటే:ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ స్టోరీతో రూపొందిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీకి తెలుగులో పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందన లభిస్తోంది. దీంతో మంచి వసూళ్లు లభిస్తున్నాయి. అయితే, ఇప్పుడిది డౌన్ అవుతూ వెళ్తోంది. ఫలితంగా 6వ రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 16 లక్షలు షేర్ రాబట్టింది.

6 రోజులకు కలిపి ఎంతొచ్చింది?:సుహాస్ - దుశ్యంత్ కాంబినేషన్‌లో రూపొందిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 6 రోజుల్లో డీసెంట్ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాం ఏరియాలో రూ. 1.30 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపి రూ. 1.88 కోట్లు షేర్ వసూలు అయింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ. 3.18 కోట్లు షేర్, రూ. 6.30 కోట్లు వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?:6 రోజుల్లో 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీకి తెలుగులో రూ. 3.18 కోట్లు షేర్ వసూలు అయింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాల్లో కలుపుకుని కేవలం రూ. 1.01 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఆరు రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.19 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.50 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:విభిన్నమైన కథతో వచ్చిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.00 కోట్లుగా నమోదైంది. ఇక, 6 రోజుల్లో దీనికి రూ. 4.19 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.19 కోట్ల లాభాలతో ఇది రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











