Ambajipeta Marriage Band: 3 కోట్ల అంబాజీపేట.. వారంలోనే రికార్డు వసూళ్లు.. నక్కతోక తొక్కిన సుహాస్
తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి హీరోలుగా మారిన వాళ్లు చాలా మందే ఉన్నారు. అందులో కొందరు మాత్రమే ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వారిలో సుహాస్ ఒకడు. ఇప్పటికే హీరోగా వరుస హిట్లను అందుకున్న ఈ టాలెంటెడ్ గాయ్.. ఇటీవలే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పల్లెటూరి నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాకు ఆరంభం నుంచీ మంచి స్పందన లభిస్తూనే ఉంది. దీంతో ఈ చిత్రానికి వసూళ్లు భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీ వారం రోజుల వసూళ్లను మీరే చూసేయండి!
మ్యారేజీ బ్యాండుతో సుహాస్
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'. దుశ్యంత్ తెరకెక్కించిన ఈ మూవీని ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్, వెంకటేష్ మహా సమర్పణలో ధీరజ్ నిర్మించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు. ఇందులో శివానీ హీరోయిన్‌గా, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు.

అంబాజీపేట బిజినెస్ డీటేల్స్
నేచురల్ యాక్టింగ్‌తో మెప్పిచే సుహాస్ హీరోగా చేసిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ చిత్రానికి మంచి డిమాండ్ వస్తుందని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.80 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఫలితంగా ఎంతో గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల అయింది.
7వ రోజు తెలుగులో ఎంతంటే
ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీకి తెలుగులో పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లుగానే మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందన లభిస్తోంది. దీంతో మంచి వసూళ్లు లభిస్తున్నాయి. అయితే, ఇప్పుడిది క్రమంగా డౌన్ అవుతూనే ఉంది. ఫలితంగా 7వ రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 లక్షలు షేర్ రాబట్టింది.

7 రోజులకు కలిపి ఎంతొచ్చింది?
సుహాస్ - దుశ్యంత్ కలిసి చేసిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 7 రోజుల్లో మంచి వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాం ఏరియాలో రూ. 1.34లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపి రూ. 1.96 కోట్లు షేర్ వసూలు అయింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ. 3.30 కోట్లు షేర్, రూ. 6.55 కోట్లు వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?
'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీకి 7 రోజుల్లో తెలుగులో రూ. 3.30 కోట్లు షేర్ వసూలు అయింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాల్లో కలుపుకుని కేవలం రూ. 1.04 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే వారం రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.34 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.90 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.00 కోట్లుగా నమోదైంది. ఇక, 7 రోజుల్లో దీనికి రూ. 4.34 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.34 కోట్ల లాభాలతో ఇది రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











