Ambajipeta Marriage Band: సుహాస్‌కు జాక్‌పాట్.. చిన్న మూవీకి రికార్డు వసూళ్లు.. లాభం ఎన్ని కోట్లంటే!
టాలీవుడ్‌లో చాలా తక్కువ మంది కుర్రాళ్లు మాత్రమే విభిన్నమైన సినిమాలు చేస్తూ.. విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ గాయ్ సుహాస్ ఒకడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌ను మొదలు పెట్టి హీరోగా మారిన అతడు.. వరుస హిట్లతో సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే సుహాస్ 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' అనే సినిమాతో వచ్చాడు. ఈ మూవీకి ఆరంభం నుంచీ మంచి స్పందన లభించింది. దీంతో ఈ చిత్రానికి వసూళ్లు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' పూర్తి వసూళ్లను చూసేయండి!
అంబాజీపేట నుంచి సుహాస్:సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'. దుశ్యంత్ తెరకెక్కించిన ఈ మూవీని ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్, వెంకటేష్ మహా సమర్పణలో ధీరజ్ నిర్మించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు. ఇందులో శివానీ హీరోయిన్‌గా, శరణ్య ప్రదీప్, గోపరాజు రమణ కీలక పాత్రలు చేశారు.

అంబాజీపేట బిజినెస్ డీటేల్స్:వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న సుహాస్ హీరోగా చేసిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. దీంతో ఈ చిత్రానికి మంచి డిమాండ్ వస్తుందని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే ఇది ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.80 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. ఫలితంగా ఎంతో గ్రాండ్‌గా ఈ సినిమా రిలీజ్ అయింది.
అలాంటి టాక్‌తో భారీ వసూళ్లు:ఎమోషనల్ కంటెంట్‌తో రూపొందిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీ ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాకు ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి ప్రేక్షకుల స్పందన లభించింది. దీంతో సుహాస్ నటించిన ఈ సినిమాకు ఆరంభం నుంచే మంచి వసూళ్లు లభించాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే:సుహాస్ - దుశ్యంత్ కాంబోలో రూపొందిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫుల్ రన్‌లో మంచి వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాం ఏరియాలో రూ. 1.46 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపి రూ. 2.15 కోట్లు షేర్ వసూలు అయింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రూ. 3.61 కోట్లు షేర్, రూ. 7.30 కోట్లు వసూలు అయింది.
ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?:'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీకి ఫుల్ రన్‌లో తెలుగులో రూ. 3.61 కోట్లు షేర్ వసూలు అయింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాల్లో కలుపుకుని కేవలం రూ. 1.12 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ముగింపు సమయానికి ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.73 కోట్లు షేర్‌తో పాటు రూ. 10.00 కోట్లు గ్రాస్ వసూలైంది.

టార్గెట్ ఇలా.. లాభం ఎంత?:సుహాస్ నటించిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3.00 కోట్లుగా నమోదైంది. ఇక, ఫుల్ రన్‌లో దీనికి రూ. 4.73 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 1.73 కోట్ల లాభాలతో ఇది రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











