Amigos day 1 collections మిక్స్‌డ్ టాక్‌తో అమిగోస్ ఊహించని కలెక్షన్లు.. కల్యాణ్ రామ్ మూవీ తొలి రోజు ఎంతంటే?

నందమూరి కల్యాణ్ రామ్, అషికా రంగనాథ్ జంటగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి ప్రకాశ్ నిర్మించిన చిత్రం అమిగోస్. బింబిసార సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత అమిగోస్ వస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ సంక్రాంతి రేసులో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకెళ్లడం కూడా ఈసినిమాపై క్రేజ్‌ను పంచాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్, తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే..

అమిగోస్ బడ్జెట్ ఎంతంటే?

అమిగోస్ బడ్జెట్ ఎంతంటే?


అమిగోస్ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. 26 కోట్ల రూపాయలతో రూపొందింది. బింబిసార సినిమా తర్వాత వస్తుండటంతో మార్కెట్‌లోను, అలాగే ట్రేడ్ సర్కిళ్లలో భారీగా క్రేజ్‌ నెలకొన్నది. దాంతో ఈ సినిమాపై భారీగా బిజినెస్ జరిగింది. కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే బెస్ట్ బిజినెస్ జరిగింది.

అమిగోస్ వరల్డ్ వైడ్ బిజినెస్

అమిగోస్ వరల్డ్ వైడ్ బిజినెస్


అమిగోస్ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 4.5 కోట్లు, సీడెడ్‌లో 2.5 కోట్లు, ఆంధ్రాలో 7 కోట్ల మేర జరిగింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 14.5 కోట్ల మేర ముగిసింది. ఇక కర్ణాటక థియేట్రికల్ హక్కులు 80 కోట్లు, ఓవర్సీస్‌లో 90 లక్షల మేర బిజినెస్ జరగడంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 16 కోట్లకుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

అమిగోస్ థియేటర్ కౌంట్

అమిగోస్ థియేటర్ కౌంట్


ఇక థియేటర్ కౌంట్ విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా 750 స్క్రీన్లలో రిలీజైంది. నైజాంలో 160 స్క్రీన్లు, సీడెడ్‌లో 60 స్క్రీన్లు, ఆంధ్రాలో 210 స్క్రీన్లతో మొత్తం 425 స్క్రీన్లలో రిలీజైంది. ఇక కర్నాటక, ఇతర రాష్ట్రాల్లో, ఓవర్సీస్‌లో 260 స్క్రీన్లలో రిలీజ్ అయింది. దాంతో ఈ సినిమాను మొత్తంగా 750 స్క్రీన్లలో విడుదల చేశారు.

అమిగోస్ తొలి రోజు ఆక్యుపెన్సీ

అమిగోస్ తొలి రోజు ఆక్యుపెన్సీ


అమిగోస్ సినిమా తొలి రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 36 శాతం, బెంగళూరులో 48 శాతం, చెన్నైలో 25 శఆతం, విజయవాడలో 24 శాతం, వరంగల్‌లో 66 శాతం, గుంటూరులో 29 శాతం, వైజాగ్‌లో 18 శాతం, నిజమాబాద్‌లో 12 శాతం, కాకినాడలో 25 శాతం, నెల్లూరులో 20 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

తొలి రోజు కలెక్షన్ల అంచనా

తొలి రోజు కలెక్షన్ల అంచనా


అమిగోస్ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..ఇండియావైడ్ ఈ చిత్రం 3 కోట్ల షేర్, 4 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇక అమెరికాలో ఈ చిత్రం ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్ల కలిపితే.. సుమారు 60K డాలర్లను రాబట్ట వచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్ల షేర్, 5 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

అమిగోస్ లాభాల్లోకి రావాలంటే?

అమిగోస్ లాభాల్లోకి రావాలంటే?


అమిగోస్ సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే కనీసం 17 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. అయితే తొలి రోజు అంచనాకు తగిన కలెక్షన్లు రాబడితే.. అలాగే అదే జోష్‌ను మరో మూడు, నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X