Amigos total collections కల్యాణ్ రామ్ డిజాస్టర్ షో.. అమిగోస్‌కు ఎన్ని కోట్ల నష్టమంటే?

బింబిసార లాంటి భారీ హిట్ తర్వాత నందమూరి కల్యాణ్ రామ్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం అమిగోస్. డిఫరెంట్ కాన్సెప్ట్‌ అంటూ ప్రమోషన్స్‌లో అదరగొట్టేయడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో కల్యాణ్ రామ్ కెరీర్‌లో భారీ బిజినెస్ జరిగిన చిత్రాల్లో ఒకటిగా అమిగోస్ నిలిచింది. అయితే తొలి ఆట నుంచే నెగిటివ్ టాక్ సొంతం చేసుకొన్న ఈ చిత్రం భారీ కలెక్షన్లను సాధించలేకపోయింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో ఎంత మేరకు వసూళ్లు సాధించిందంటే?

భారీగానే అమిగోస్ బిజినెస్

భారీగానే అమిగోస్ బిజినెస్

నూతన దర్శకుడు రాజేంద్ర రెడ్డి రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, పాటలు మంచి క్రేజ్‌ను పెంచాయి. దాంతో థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. నైజాంలో 4 కోట్ల మేర, సీడెడ్‌లో 1 కోటి, ఆంధ్రాలో 4.5 కోట్లతో కలిపి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం అటు ఇటుగా 9.5 కోట్ల బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక, ఓవర్సీస్ కలిపి మొత్తంగా 2.5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. దాంతో ఈ చిత్రం 12 కోట్ల మేర ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 12.5 కోట్ల లక్ష్యంతో బాక్సాఫీస్ బరిలోకి దిగింది.

అమిగోస్ కలెక్షన్లు

అమిగోస్ కలెక్షన్లు


అమిగోస్ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో తొలి రోజు భారీగా కలెక్షన్లు నమోదు చేసింది. ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా తొలి రోజున 3.2 కోట్లు, రెండో రోజున 1.55 కోట్లు, మూడో రోజున 1.7 కోట్లు, నాలుగో రోజున 70 లక్షలు, ఐదో రోజున 65 లక్షలు, ఆరో రోజున 45 లక్షలు, 7 రోజున 25 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం సుమారుగా 10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఏపీ, నైజాంలో ఎంత వసూలు చేసిందంటే?

ఏపీ, నైజాంలో ఎంత వసూలు చేసిందంటే?

ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాల వారీగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 1.5 కోట్లు, సీడెడ్‌లో 1 కోటి, ఉత్తరాంధ్రలో 65 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 45 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 30 లక్షలు, గుంటూరు జిల్లాలో 60 లక్షలు, కృష్ణా జిల్లాలో 40 లక్షలు, నెల్లూరు జిల్లాలో 25 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఏపీ, నైజాంలో 5 కోట్లకుపైగా షేర్, 8.5 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

కర్ణాటక, ఓవర్సీస్‌లో

కర్ణాటక, ఓవర్సీస్‌లో

ఇక కర్ణాటక, ఓవర్సీస్‌లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కర్ణాటకలో 30 లక్షలకుపైగా, ఓవర్సీస్‌లో 1.5 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ఈ సినిమా 10.5 కోట్ల గ్రాస్, సుమారు 6 కోట్ల మేర షేర్ సాధించింది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత హ్యాట్రిక్‌పై కన్నేసిన మైత్రీ మూవీ మేకర్స్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. మైత్రీ బాక్సాఫీస్ విజయయాత్రకు చిన్న బ్రేక్ వేసింది.

అమిగోస్ వల్ల నష్టం ఎంతంటే?

అమిగోస్ వల్ల నష్టం ఎంతంటే?


అమిగోస్ సినిమా లాభ నష్టాల విషయానికి వస్తే.. ఈ సినిమా 12 కోట్లకుపైగా బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బరిలోకి దూకింది. ఈ సినిమా ఓవరాల్ థియేట్రికల్ రన్‌లో కేవలం 6 కోట్లకుపైగా షేర్ సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా థియేట్రికల్‌గా సుమారు 6 కోట్ల మేర నష్టాలను డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లకు మిగిల్చింది. బింబిసార తర్వాత ఇలాంటి ఫలితం కల్యాణ్ రామ్‌కు రావడం ఊహించని పరిణామమే అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X