Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
యూట్యూబ్‌లో అమ్మమ్మగారిల్లు హల్చల్
శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్ లో నాగశౌర్య, బేబి షామిలి జంటగా కె.ఆర్ మరియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం అమ్మమ్మగారిల్లు. సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. యూ ట్యూబ్ లో టీజర్ దూసుకుపోతుంది. నేటి జనులంతా తమ బాల్యం గుర్తు చేసారంటూ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో డిటిఎస్ మిక్సింగ్ పనులను జరుపుకుంటోంది. అలాగే మేడే సందర్భంగా మరో కొత్త పోస్టర్ ను కూడా మార్కెట్ లోకి రిలీజ్ చేసారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ చక్కటి కుటుంబ కథా చిత్రం కావడం..స్వచ్ఛమైన తెలుగు టైటిల్ మూవీ కావడంతో సినిమాకు మంచి క్రేజ్ వస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి వివేష స్పందన లభిస్తోంది. పలువురు సినీ పెద్దలు కూడా టీజర్ చూసి ఎంతో బాగుందని మెచ్చుకున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీ గా పెరిగిపోతున్నాయి. వేసవి కానుకగా సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.
అమ్మమ్మ గారిల్లు శాటిలైట్ హక్కులను 2.75 కోట్లకు ప్రముఖ జెమిని టీవీ ఛానల్ సినిమా తీసుకుంది. లాగే ఓవర్సీస్ బిజినెస్, హిందీ రైట్స్ కు సంబంధించి మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయి. నాగ శౌర్య కెరీర్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ మూవీ గా నిలుస్తుంది అని నిర్మాతలు తెలిపారు.