twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యూట్యూబ్‌లో అమ్మ‌మ్మ‌గారిల్లు హల్‌చల్

    By Rajababu
    |

    శ్రీమ‌తి స్వ‌ప్న స‌మ‌ర్ప‌ణ‌లో స్వాజిత్ మూవీస్ బ్యాన‌ర్ లో నాగ‌శౌర్య‌, బేబి షామిలి జంట‌గా కె.ఆర్ మ‌రియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం అమ్మమ్మగారిల్లు. సుంద‌ర్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న ల‌భించింది. యూ ట్యూబ్ లో టీజ‌ర్ దూసుకుపోతుంది. నేటి జ‌నులంతా తమ బాల్యం గుర్తు చేసారంటూ కామెంట్ల రూపంలో త‌మ అభిప్రాయాల‌ను తెలుపుతున్నారు. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో భాగంగా హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్ లో డిటిఎస్ మిక్సింగ్ ప‌నుల‌ను జ‌రుపుకుంటోంది. అలాగే మేడే సంద‌ర్భంగా మ‌రో కొత్త పోస్ట‌ర్ ను కూడా మార్కెట్ లోకి రిలీజ్ చేసారు.

    Ammamma Gari Illu in DTS mixing

    ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ చ‌క్క‌టి కుటుంబ క‌థా చిత్రం కావ‌డం..స్వ‌చ్ఛ‌మైన తెలుగు టైటిల్ మూవీ కావ‌డంతో సినిమాకు మంచి క్రేజ్ వ‌స్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి వివేష స్పంద‌న ల‌భిస్తోంది. పలువురు సినీ పెద్ద‌లు కూడా టీజ‌ర్ చూసి ఎంతో బాగుంద‌ని మెచ్చుకున్నారు. దీంతో సినిమాపై అంచనాలు భారీ గా పెరిగిపోతున్నాయి. వేస‌వి కానుక‌గా సినిమా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.

    అమ్మమ్మ గారిల్లు శాటిలైట్ హ‌క్కుల‌ను 2.75 కోట్ల‌కు ప్ర‌ముఖ జెమిని టీవీ ఛానల్ సినిమా తీసుకుంది. లాగే ఓవ‌ర్సీస్ బిజినెస్, హిందీ రైట్స్ కు సంబంధించి మంచి ఆఫర్స్ కూడా వ‌స్తున్నాయి. నాగ శౌర్య కెరీర్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ మూవీ గా నిలుస్తుంది అని నిర్మాతలు తెలిపారు.

    English summary
    After Success of Chalo, Naga Shaurya is coming up with a family drama called Ammamma Gari Illu. The film marks the return of Shamili (Siddharath starrer Oye). This movie satellite right sold for fancy rate. Gemini Television acquired the rates for Rs.2.75 crores. Now this movie is in DTS Mixing stage.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X