Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
2.75 కోట్లకు అమ్మమ్మగారిల్లు అమ్మకం
2.75 కోట్లకు అమ్మమ్మగారిల్లు శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న జెమినీ ఛానల్శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్ లో నాగశౌర్య, బేబి షామిలి జంటగా కె.ఆర్ మరియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం అమ్మమ్మగారిల్లు. సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్టు లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. త్వరలో టీజర్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, చక్కటి కుటుంబ కథా చిత్రం కావడం..స్వచ్ఛమైన తెలుగు టైటిల్ మూవీ కావడంతో సినిమాకు మంచి క్రేజ్ వస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా శాటిలైట్ భారీ ధరకు అమ్ముడుపోయింది. ప్రముఖ జెమిని టీవీ ఛానల్ సినిమా శాటిలైట్ హక్కులను 2.75 కోట్లకు తీసుకుంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత గా పెరుగుతున్నాయి. అలాగే ఓవర్సీస్ బిజినెస్, హిందీ రైట్స్ కు సంబంధించి మంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయి. నాగ శౌర్య కెరీర్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ మూవీ గా నిలుస్తుంది. మిగతా నటీనటులంతా కూడా చాలా చక్కగా నటించారు. దర్శకులు ప్రతీ సన్నివేశాన్ని చాలా అద్భుతంగా..అందంగా చూపించారు. వేసవి కానుకగా సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.
అమ్మమ్మగారిల్లు చిత్ర నిర్మాతలకు మార్కెట్ లో మంచి పేరు ఉండటం వల్ల స్టార్ హీరోలు సైతం ఈ బ్యానర్లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఒక మూవీని అమ్మమ్మగారిల్లు చిత్ర దర్శకుడితోనే నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.